AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండగలన్నీ ఆ రోజుల్లోనే.. అయినా డోంట్ వర్రీ.. ఇలా ప్లాన్ చేస్తే 2027లో లాంగ్ ట్రిప్పులే ట్రిప్పులు..

ఒకవైపు వీకెండ్‌లోనే ముఖ్యమైన పండుగలన్నీ కలిసిపోయి కార్పొరేట్ ఉద్యోగులకు నిరాశ మిగులుస్తుంటే.. మరోవైపు తెలివిగా సెలవులు వాడుకునేవారికి 2027 క్యాలెండర్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. కేవలం మూడు రోజులు లీవ్ పెడితే 9 రోజుల హాలిడేస్ ఎంజాయ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. 2027లో ఏ పండుగ ఏ రోజు వచ్చింది? లాంగ్ వీకెండ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అనేది తెలుసుకుందాం..

పండగలన్నీ ఆ రోజుల్లోనే.. అయినా డోంట్ వర్రీ.. ఇలా ప్లాన్ చేస్తే 2027లో లాంగ్ ట్రిప్పులే ట్రిప్పులు..
Festivals On Weekends And Long Weekend Trip PlannerImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Nov 27, 2026 | 7:06 PM

Share

కొత్త ఏడాది వస్తుందంటే ఉద్యోగులు, ట్రావెల్ ప్రియులు ముందుగా క్యాలెండర్ వైపు చూస్తారు. ఏ పండుగ ఏ రోజు వచ్చింది? ఎన్ని లాంగ్ వీకెండ్స్ వస్తాయి? ఎక్కడికి ట్రిప్ వేయాలి? అని లెక్కలు వేసుకుంటారు. అయితే 2027 క్యాలెండర్ చూస్తే మాత్రం కార్పొరేట్ ఉద్యోగులకు కాస్త నిరాశ కలిగించే అంశం కనిపిస్తోంది. ముఖ్యమైన సెలవులు చాలా వరకు శని, ఆదివారాల్లోనే రావడం గమనార్హం. కానీ కొద్దిగా తెలివిగా సెలవులు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఏడాది పొడవునా అదిరిపోయే లాంగ్ వీకెండ్స్ కొట్టేయచ్చని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 2027 హాలిడే ప్లానర్‌లు చెబుతున్నాయి.

2027లో వీకెండ్‌లో వచ్చిన ప్రధాన సెలవులివే!

సాధారణ శని, ఆదివారాలతో కలిసిపోయిన కీలక పండుగలు, సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..

  • మార్చి 6, 2027 (శనివారం): మహాశివరాత్రి
  • ఆగస్టు 15, 2027 (ఆదివారం): స్వాతంత్ర్య దినోత్సవం
  • సెప్టెంబర్ 4, 2027 (శనివారం): వినాయక చవితి / గణేష్ చతుర్థి
  • అక్టోబర్ 2, 2027 (శనివారం): గాంధీ జయంతి
  • అక్టోబర్ 9, 2027 (శనివారం): దసరా / విజయదశమి
  • డిసెంబర్ 25, 2027 (శనివారం): క్రిస్మస్

సెలవులు ప్లాన్ చేస్తే లాంగ్ వీకెండ్స్ ఎలా వస్తాయంటే?

పండుగలు వీకెండ్‌లో వచ్చినప్పటికీ, ఆ చుట్టుపక్కల రోజుల్లో కొన్ని సెలవులు పెడితే దీర్ఘకాలిక విహారయాత్రలకు అవకాశం ఉంటుంది. 2027 ట్రిప్ ప్లానర్ ప్రకారం హైలైట్స్ ఇవే..

జనవరి: జనవరి 14న మకర సంక్రాంతి ఉంటే, జనవరి 15న సెలవు తీసుకుంటే జనవరి 16, 17 వీకెండ్‌తో కలిపి నాలుగు రోజుల విరామం లభిస్తుంది. అలాగే జనవరి 23, 24 వీకెండ్‌కు జనవరి 25న లీవ్ కలిపితే జనవరి 26 (రిపబ్లిక్ డే) వరకు నాలుగు రోజుల సెలవులు వస్తాయి.

మార్చి: మార్చి 20, 21 వీకెండ్, మార్చి 22న హోలీ వస్తున్నాయి. మార్చి 23, 24, 25 తేదీల్లో మూడు రోజులు సెలవు పెడితే మార్చి 26 (గుడ్ ఫ్రైడే), మార్చి 27, 28 వీకెండ్‌తో కలిపి ఏకంగా 9 రోజుల భారీ లాంగ్ వీకెండ్ దొరుకుతుంది.

ఏప్రిల్: ఏప్రిల్ 3, 4 వీకెండ్‌కు ఏప్రిల్ 5, 6 సెలవులు జత చేస్తే ఏప్రిల్ 7న ఉగాది సెలవు కలిసి వస్తుంది. అలాగే ఏప్రిల్ 15న శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 16న లీవ్ తీసుకుంటే ఏప్రిల్ 17, 18 వీకెండ్‌తో కలిపి నాలుగు రోజులు సెలవులు దక్కుతాయి.

మే: మే 15, 16 వీకెండ్‌కు మే 17 (బక్రీద్), మే 20 (బుద్ధ పూర్ణిమ) సెలవులు ఉన్నాయి. మధ్యలో మే 21న లీవ్ తీసుకుంటే మే 22, 23 వీకెండ్ వరకు పొడిగించుకోవచ్చు.

జూన్: జూన్ 16న మొహర్రం వస్తుండగా, జూన్ 17, 18 తేదీల్లో లీవ్ పెడితే జూన్ 19, 20 వీకెండ్‌తో కలిపి ఐదు రోజుల బ్రేక్ వస్తుంది.

ఆగస్టు: ఆగస్టు 14, 15 వీకెండ్‌కు ఆగస్టు 16న లీవ్ కలిపితే ఆగస్టు 17 (రక్షా బంధన్) వరకు నాలుగు రోజుల సెలవులు లభిస్తాయి. అలాగే ఆగస్టు 25న జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26, 27 తేదీల్లో సెలవు తీసుకుంటే ఆగస్టు 28, 29 వీకెండ్‌తో కలిపి ఐదు రోజుల విరామం వస్తుంది.

అక్టోబర్ – నవంబర్: అక్టోబర్ 29న దీపావళి రాగా, అక్టోబర్ 30, 31 వీకెండ్, నవంబర్ 1 కలిసి వస్తాయి.

డిసెంబర్: డిసెంబర్ 24న లీవ్ తీసుకుంటే డిసెంబర్ 25 (క్రిస్మస్), డిసెంబర్ 26 ఆదివారంతో కలిపి మూడు రోజుల వీకెండ్ లభిస్తుంది.

Follow Us