AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు HDFC బ్యాంకుకు వెళ్లకుండానే ఈమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు! పూర్తి ప్రాసెస్ ఇదే..

Bank Account: ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ పనిచేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. OTP అందుకోకపోతే మొబైల్ నెట్‌వర్క్, బ్యాంకులో నమోదైన నంబర్ వివరాలను తనిఖీ చేయాలి. జాయింట్ అకౌంట్ ఉన్నవారు అవసరమైతే ప్రతి ఖాతాదారుడు విడిగా..

మీరు HDFC బ్యాంకుకు వెళ్లకుండానే ఈమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు! పూర్తి ప్రాసెస్ ఇదే..
Hdfc
Subhash Goud
|

Updated on: Nov 27, 2026 | 7:00 PM

Share

Bank Account: బ్యాంకు ఖాతాదారులకు ఈమెయిల్ ఐడీ ఎంతో ముఖ్యమైనది. ఖాతాలో జరిగే లావాదేవీల వివరాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ముఖ్యమైన అలర్ట్స్, ఇతర బ్యాంకింగ్ సమాచారాన్ని పొందాలంటే రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడీ అందుబాటులో ఉండాలి. అయితే చాలామంది బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఇచ్చిన ఈమెయిల్ ఐడీని ఆ తర్వాత మార్చడం మర్చిపోతుంటారు. మరికొందరు పాత ఈమెయిల్ ఐడీని ఉపయోగించకపోవడం వల్ల బ్యాంకు నుంచి వచ్చే కీలక సమాచారం అందుకోలేకపోతుంటారు.

ఇలాంటి ఖాతాదారులకు HDFC బ్యాంక్ ఒక సదుపాయాన్ని అందిస్తోంది. బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో తమ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీని మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. InstaServices, NetBanking, Mobile Banking వంటి డిజిటల్ సేవల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఈమెయిల్ ఐడీని ఎందుకు అప్‌డేట్ చేయాలి?

బ్యాంకు ఖాతాకు సరైన ఈమెయిల్ ఐడీని అనుసంధానం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

  • బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ పొందవచ్చు.
  • నెలవారీ ఈ-స్టేట్‌మెంట్లు అందుతాయి.
  • బ్యాంకు నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం మిస్ కాకుండా ఉంటుంది.
  • ఆన్‌లైన్ లావాదేవీల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
  • బ్యాంకింగ్ సేవలు, కొత్త నిబంధనలకు సంబంధించిన అప్‌డేట్స్ పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఈమెయిల్ ఐడీ మార్చుకోవడం ఎలా?

HDFC బ్యాంక్ ఖాతాదారులు కింది విధంగా తమ ఈమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు.

1. ముందుగా HDFC బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.hdfc.bank.in ను సందర్శించాలి.

2. అందులో Need Help విభాగంలోకి వెళ్లి Accounts/Deposit Services ఎంపిక చేసుకోవాలి.

3. తర్వాత Update E-mail ID ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ లేదా PAN నంబర్ లేదా కస్టమర్ ఐడీ వివరాలను నమోదు చేయాలి.

5. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయాలి.

6. నిబంధనలు చదివి అంగీకరించిన తర్వాత కొత్త ఈమెయిల్ ఐడీని నమోదు చేయాలి.

7. కొత్త ఈమెయిల్ ఐడీకి వచ్చిన OTP ద్వారా దానిని ధ్రువీకరించాలి.

8. అనంతరం డెబిట్ కార్డు ATM PINలోని చివరి నాలుగు అంకెలు, కార్డు గడువు తేదీ, CVV వివరాలతో గుర్తింపును నిర్ధారించాలి. ప్రత్యామ్నాయంగా NetBanking యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా కూడా ధ్రువీకరణ చేసుకోవచ్చు.

బ్యాంకుకు వెళ్లి కూడా మార్చుకోవచ్చు:

ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయడం ఇష్టం లేని వారు సమీపంలోని HDFC బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించవచ్చు.

  • బ్యాంకు నుంచి Customer Request Form తీసుకోవాలి.
  • అందులో కొత్త ఈమెయిల్ ఐడీతో పాటు అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
  • ఆధార్ బయోమెట్రిక్ ద్వారా లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంతో ధ్రువీకరణ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన ఫారమ్‌ను బ్యాంకులో సమర్పించాలి.
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ తీసుకోవాలి.

ఏయే గుర్తింపు పత్రాలు అవసరం?

బ్యాంకు బ్రాంచ్‌లో ఈమెయిల్ ఐడీ మార్చుకునే సమయంలో గుర్తింపు కోసం కింది పత్రాలను ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డు

  • PAN కార్డు
  • పాస్‌పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటర్ ఐడీ

అవసరాన్ని బట్టి స్వీయ ధ్రువీకరణ చేసిన గుర్తింపు పత్రం కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

ఈ సేవకు ఎలాంటి ఛార్జీలు ఉంటాయా?

HDFC బ్యాంక్ అధికారిక సమాచారం ప్రకారం ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవడానికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ఆన్‌లైన్ ద్వారా InstaServices, NetBanking, Mobile Banking ఉపయోగించి అప్‌డేట్ చేసుకుంటే సాధారణంగా 48 గంటల్లో ప్రక్రియ పూర్తవుతుంది. బ్రాంచ్ ద్వారా దరఖాస్తు చేస్తే మరికొంత సమయం పట్టవచ్చు.

ముఖ్యమైన విషయం: ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ పనిచేస్తున్నట్లు నిర్ధారించుకోవాలి. OTP అందుకోకపోతే మొబైల్ నెట్‌వర్క్, బ్యాంకులో నమోదైన నంబర్ వివరాలను తనిఖీ చేయాలి. జాయింట్ అకౌంట్ ఉన్నవారు అవసరమైతే ప్రతి ఖాతాదారుడు విడిగా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: 3 ఏళ్ల పాటు పీఎఫ్‌లో డబ్బు జమ చేయకపోతే ఆ నిధులు పోతాయా? ఖాతా ఎప్పుడు క్లోజ్‌ అవుతుంది?

ఇది కూడా చదవండి: LPG Gas: 14.2 కేజీల సిలిండర్‌ కొత్త కనెక్షన్‌లు ఎందుకు అందుబాటులో లేవు?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us