AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రూ.200 కోట్ల స్కామ్.. జైలు నుంచే స్కెచ్.. ఓటీటీలో సుకేశ్ చంద్రశేఖర్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ రియల్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

OTT Movie: రూ.200 కోట్ల స్కామ్.. జైలు నుంచే స్కెచ్.. ఓటీటీలో సుకేశ్ చంద్రశేఖర్ క్రైమ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 26, 2026 | 4:53 PM

Share

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సుకేష్ చంద్రశేఖర్ జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఒక కొత్త డాక్యుమెంటరీని ప్రకటించింది . దీనికి ‘లవ్, స్కామ్ ఔర్ ధోకా: ది సుకేష్ చంద్రశేఖర్ స్టోరీ’ అని పేరు పెట్టారు. వందల కోట్ల రూపాయల విలువైన మోసాలు, దోపిడీ కేసుల చీకటి కోణాన్ని ఈ సిరీస్ లో చూపించనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ డిసెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. గతంలో ‘కర్రీ అండ్ సైనైడ్’, ‘ది ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ’ వంటి విజయవంతమైన డాక్యుమెంటరీలను నిర్మించిన ‘ఇండియా టుడే ఒరిజినల్స్’ ఈ క్రైమ్ సిరీస్ ను నిర్మించింది. మౌమితా సేన్, నియంత శేఖర్ సంయుక్తంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. దాదాపు రెండు సంవత్సరాల విస్తృత పరిశోధన తర్వాత ఈ ప్రాజెక్ట్ సిద్ధమైంది. సుమారు రూ. 200 కోట్ల విలువైన స్కామ్, ప్రజలను మోసం చేయడానికి సుకేష్ ఉన్నత ప్రభుత్వ అధికారుల వలె ఎలా నటించేవాడో ఈ సిరీస్ లో చూపించనున్నారు. అలాగే రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులతో అతనికి ఉన్న సంబంధాలను కూడా ఈ డాక్యుమెంటరీలో ఆవిష్కరించనున్నారు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్రను కూడా చూపించనున్నారు.

ఢిల్లీలోని అత్యంత సురక్షితమైన తిహార్ జైలులో ఉన్నప్పుడు కూడా సుకేష్ తన మోసాల ముఠాను ఏ విధంగా నడిపించాడు . వ్యవస్థలోని లొసుగులను అతను తనకు అనుకూలంగా ఎలా వాడుకున్నాడు? ఇలా కేవలం ఆర్థిక మోసాలను మాత్రమే కాకుండా, అతని మోసం వెనుక ఉన్న మనస్తత్వాన్ని కూడా ఈ సిరీస్ లో విశ్లేషించారు.. ఈ ముఠా చాలా కాలం పాటు ఎలా చురుకుగా పనిచేసిందనే దాని గురించి ఆసక్తికరమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం సుకేష్‌పై ఉన్న కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అతనిపై ఉన్న ఆరోపణలు ఇంకా కోర్టులో నిరూపించబడలేదు. డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ డాక్యుమెంటరీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సిరీస్ కు చాందినీ అహ్లావత్ దాబాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా, మౌమితా సేన్, నియంత శేఖర్ దర్శకత్వం వహించారు. కరణ్ రాణా కో-డైరెక్టర్‌గా పనిచేశారు. మునీశ్ పాండే, షమ్స్ తాహిర్ ఖాన్ క్రైమ్ కన్సల్టెంట్స్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో  ‘లవ్ స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ’

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us