AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోర్టు ఆదేశాలు బేఖాతర్.. సైబరాబాద్ సీపీ, డీసీపీకి జైలు శిక్ష విధించిన హైకోర్టు!

కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రెండేసి వారాల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలు బేఖాతర్.. సైబరాబాద్ సీపీ, డీసీపీకి జైలు శిక్ష విధించిన హైకోర్టు!
Court Sentences Cyberabad Police Officers
Balaraju Goud
|

Updated on: Nov 26, 2026 | 4:53 PM

Share

హైదరాబాద్: కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రెండేసి వారాల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు పోలీసు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను పోలీసులు అమలు చేయలేదని ఆరోపిస్తూ బాధితుడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్లు పరిగణించి ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది.

అంతేకాకుండా జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజుల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జైలు శిక్ష అమలును వారం రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈలోగా పైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొందాలని సూచించింది. లేనిపక్షంలో గడువు ముగిసిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us