AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేబుల్ టెన్షన్​ లేకుండా మొబైల్​ చార్జింగ్​ పెట్టుకునే డివైజ్​ కోసం చూస్తున్నారా? Realme Realfit మీకు పర్​ఫెక్ట్

స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతున్న కొద్దీ పవర్ బ్యాంకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, ఎక్కువ సమయం బయట ఉండేవారు ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పవర్ బ్యాంక్‌తో పాటు ఛార్జింగ్ కేబుల్‌ను ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సి రావడం కూడా కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా Realme TechLife కొత్త Realfit 20,000mAh పవర్ బ్యాంక్‌ను తీసుకొచ్చింది. ఇన్‌బిల్ట్ Type-C కేబుల్, ఫాస్ట్ ఛార్జింగ్, కాంపాక్ట్ డిజైన్‌తో ఈ మోడల్ ఆకట్టుకుంటోంది.

కేబుల్ టెన్షన్​ లేకుండా మొబైల్​ చార్జింగ్​ పెట్టుకునే డివైజ్​ కోసం చూస్తున్నారా? Realme Realfit మీకు పర్​ఫెక్ట్
Realme Realfit 20000mah Power Bank
Nikhil
|

Updated on: Nov 28, 2026 | 6:45 AM

Share

పెద్ద బ్యాటరీ సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ బరువుతో రూపొందించిన Realfit 20,000mAh పవర్ బ్యాంక్‌లో పలు ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసే సదుపాయం, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు అందించారు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ట్యాబ్లెట్లు, ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాల్లో కేబుల్స్ తీసుకెళ్లే అవసరం లేకుండా ఛార్జింగ్ చేసుకోవాలనుకునే వారికి ఈ పవర్ బ్యాంక్ మంచి ఎంపికగా నిలవనుంది.

ఇన్‌బిల్ట్ కేబుల్

Realme Realfit పవర్ బ్యాంక్ 20,000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. దీని బరువు కేవలం 359 గ్రాములు. 3D ట్రాన్స్‌పరెంట్ షెల్ డిజైన్‌తో పాటు యాంబర్ ఎల్లో కలర్ ఫినిషింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్ట్ డ్యూయల్ సైడెడ్ Type-C కేబుల్ అందించారు. ఈ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడంతో పాటు పవర్ బ్యాంక్‌ను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్థాయిని తెలుసుకునేందుకు డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉంది.

గరిష్టంగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ Type-C కేబుల్‌తో పాటు అదనపు USB Type-C పోర్ట్‌, USB Type-A పోర్ట్ ఉన్నాయి. వీటి ద్వారా ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. Realme ఫోన్లతో పాటు Samsung, OnePlus, iPhone, iPad, ట్యాబ్లెట్లకు కూడా ఛార్జింగ్ అందించవచ్చు. 20,000mAh బ్యాటరీ సామర్థ్యంతో సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను సుమారు 3 నుంచి 4 సార్లు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు

ఈ పవర్ బ్యాంక్‌లో 8-లేయర్ల సేఫ్టీ ప్రొటెక్షన్ అందించారు. ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్, ఓవర్ వోల్టేజ్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించే ఫీచర్లు ఉన్నాయి. BIS సర్టిఫికేషన్‌తో పాటు విమాన ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించారు. దీంతో క్యాబిన్ బ్యాగ్‌లో తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది.

ధర విషయానికి వస్తే Realme Realfit 20,000mAh పవర్ బ్యాంక్ ధర రూ.2,799గా ఉంది. కొన్ని సందర్భాల్లో దీని రిటైల్ ధర రూ.3,499 వరకు ఉండవచ్చు. దీపావళి ఆఫర్‌లు, ప్రత్యేక సేల్‌లు, బ్యాంక్ డిస్కౌంట్ల సమయంలో సుమారు రూ.1,899 నుంచి రూ.1,999 ధరకు లభించే అవకాశం ఉంది. యాంబర్ ఎల్లోతో పాటు అబ్సిడియన్ బ్లాక్, గ్లేసియర్ వైట్ రంగుల్లోనూ అందుబాటులో ఉంది. కేబుల్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

Follow Us