AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maatrubhumi Movie: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. వారికి రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే

ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇటీవల, సల్మాన్ ఖాన్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి ఆడియెన్స్ కు ఒక బంపర్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేశాడు.

Maatrubhumi Movie: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. వారికి రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
Maatrubhumi Movie
Basha Shek
|

Updated on: Nov 07, 2026 | 10:28 PM

Share

అనేక అడ్డంకులు, వాయిదాల పర్వం తర్వాత సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భారత్-చైనా సైనికుల మధ్య పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సున్నితమైన అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతంలో ప్రకటించిన తేదీ కంటే చాలా ఆలస్యంగా విడుదలవుతోంది. ఇటీవల, సల్మాన్ ఖాన్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, ఈ చిత్రాన్ని వీక్షించే ప్రేక్షకుల కోసం ఒక గొప్ప ఆఫర్‌ను కూడా అనౌన్స్ చేశారు. సల్మాన్ ఖాన్ చిత్రం ‘మాతృభూమి’ ట్రైలర్ నిన్న (నవంబర్ 6) విడుదలైంది. ఈ చిత్రం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో, సల్మాన్ ఖాన్ సీనియర్ సిటిజన్ల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కేవలం రూ. 11కే చూడవచ్చని సల్మాన్ ప్రకటించారు. ఏ సినిమా హాల్‌లోనైనా ‘మాతృభూమి’ చిత్రాన్ని చూడటానికి వచ్చే సీనియర్ సిటిజన్లు కేవలం రూ. 11కే ఈ చిత్రాన్ని చూడవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసమే సల్మాన్ ఖాన్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు.

కాగా మొదట ఈ సినిమాకు ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అని టైటిల్ పెట్టారు. భారత్- చైనా సరిహద్దుల వివాదాలు, 2020లో లడఖ్ సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ వ్యాలీలో భారత్ – చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రచారం జరిగింది. దీంతో ఈ సినిమా భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఈ సినిమా ‘మాతృభూమి’గా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ల కారణంగానే ఈ మార్పు జరిగిందని బాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. అయితే, నటుడు సల్మాన్ ఖాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. స్క్రిప్ట్‌ను మార్చమని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఇది సైనికులు, వారి కుటుంబాల త్యాగాన్ని చూపించే కథ అని పేర్కొన్నారు. ఇక సినిమా విడుదల ఆలస్యం కావడం గురించి మాట్లాడుతూ, సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల విడుదల ఆలస్యమైందని ఆయన చెప్పారు. పలు మార్లు వాయిదా పడిన మాతృభూమి చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us