AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త జానర్లతో కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్న హీరోలు

కొత్త జానర్లతో కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్న హీరోలు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 6:01 PM

Share

2027లో విజయవంతమైన కమ్‌బ్యాక్‌ కోసం టాలీవుడ్‌ హీరోలు కొత్త కథలు, విభిన్న జానర్లను ఎంచుకుంటున్నారు. రామ్‌ పోతినేని స్వీయ దర్శకత్వంలో థ్రిల్లర్‌ సినిమా చేయనుండగా, రజనీకాంత్‌ ‘ధర్మన్‌’లో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వరుణ్‌ తేజ్‌ నిహారిక నిర్మిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘బరి’లో నటిస్తున్నారు. మరోవైపు శర్వానంద్‌ ‘భోగి’తో పాటు ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘జార్జ్‌ క్రిష్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కేవలం పాన్ ఇండియా విజువల్ వండర్స్ మాత్రమే కాదు.. ఇటీవల బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన యంగ్ హీరోలు కూడా 2027 మీద గట్టిగానే గురిపెట్టారు. తమ పాత ఇమేజ్‌ను పక్కనపెట్టి.. ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా కొత్త జానర్లు, ఊహించని మేకోవర్లతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రామ్, వరుణ్ తేజ్, శర్వానంద్ లాంటి హీరోలు సిద్ధమవుతున్నారు. వరుసగా మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించిన రామ్ పోతినేని.. ఇప్పుడు తన రూట్ మార్చారు. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి వెరైటీ కాన్సెప్ట్‌తో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ కోసం స్వయంగా మెగాఫోన్ పట్టిన రామ్‌, థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా చేస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ హీరోగా తెరకెక్కతున్న ధర్మన్‌లోనూ స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారు. కొరియన్‌ కనకరాజు సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన వరుణ్‌ తేజ్‌, నెక్ట్స్ మూవీతో అదే జోరు కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నారు. చెల్లెలు నిహారిక నిర్మాణంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న బరి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్‌ జోరు కంటిన్యూ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఇయర్‌లో భోగి లాంటి మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్, కొత్త ఏడాదిని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న జార్జ్‌ క్రిష్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

Follow Us