హెచ్చరిక.. ఎనర్జీ డ్రింక్స్ తాగితే యువత గుండెకు ముప్పే.. 

samatha

9  November 2026

Pic credit - Pinterest

యువత ఎనర్జీ డ్రింక్స్‌కు ఎక్కువగా అడక్ట్ అయిపోయారు. ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత చాలా మంది దీనిని తాగుతున్నారు.

ఎనర్జీ డ్రింక్స్

అయితే ఇలా ప్రతి రోజూ ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, మఖ్యంగా ఇది గుండెకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యానికి ప్రమాదకరం

రీసెంట్‌గా  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2026 స్టడీలో ఓ షాకింగ్ నిజం బయటపడింది, ఎనర్జీ డ్రింక్స్ తాగే యువతలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంట.

గుండె పోటు

రీసెర్చర్లు 2017 నుంచి 2025 వరకు FDA కి వచ్చిన 28000 రిపోర్ట్స్ ను పరిశీలించారు, అందులో 854 రిపోర్ట్స్ కెఫిన్, స్టిమ్యులెంట్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్, సప్లిమెంట్స్ కు సంబంధించినవే.

రిపోర్ట్స్

వీటిని తాగిన వారిలో కార్డియాక్ అరెస్ట్  11 రెట్లు ఎక్కువగా, హార్ట్ ఎటాక్ 4.5 రెట్లు ఎక్కువగా, గుండె దడ, అరిథ్మియా 4 రెట్లు ఎక్కువగా కనిపించాయంట

గుండె పోటు , కార్డియాక్ అరెస్ట్

అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ గుండె సమస్యల రిపోర్ట్స్ లో 45 శాతం మంది 18 నుంచి 34 ఏళ్ల వయసు ఉన్న యువకులే కావడం.

18 నుంచి 34 ఏళ్ల వయసు

ఎనర్జీ డ్రింక్స్ లో కేవలం కెఫిన్ మాత్రమే కాదు, గ్వారానా, యెర్బా మేట్, సైనెఫ్రిన్, యోహింబిన్, DMAA లాంటి ప్రమాదకర స్టిమ్యులెంట్స్ కూడా ఉంటాయంట

ప్రమాకరమైనవి