ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై వివాహిత మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. అనారోగ్యంతో భర్తతో కలిసి క్లినిక్కు వెళ్లిన తనకు సెలైన్లో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. భర్తను మందులు తీసుకురావాలని బయటకు పంపినట్లు ఆరోపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మహిళను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.