Ganesh Shobha Yatra Live: బై బై గణేశా..! గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి.. ప్రత్యక్ష ప్రసారం..
హైదరాబాద్‌లో సందడంతా ఖైరతాబాద్ గణపతి చుట్టూనే ఉంది. మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. మహా గణపతి శోభాయాత్ర జరిగే రోడ్డు మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇసకేస్తే రాలనంత జనం శోభాయాత్ర దగ్గరున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రత్యక్ష ప్రసారం వీడియోను చూడండి..
హైదరాబాద్‌లో సందడంతా ఖైరతాబాద్ గణపతి చుట్టూనే ఉంది. మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. మహా గణపతి శోభాయాత్ర జరిగే రోడ్డు మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇసకేస్తే రాలనంత జనం శోభాయాత్ర దగ్గరున్నారు. భక్తుల కేరింతల నడుమ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ భక్తుల కోలాహలం, ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో మార్మోగుతున్నాయి. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషుడు.. భక్తులకు దర్శనం ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ దగ్గర భక్తుల సందడి నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులు హుస్సేన్ సాగర్ చెంతకు చేరుకుంటున్నాయి. దీంతో వివిధ గెటప్‌లలో ఉన్న వినాయక విగ్రహాలను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను భక్తులు శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు నిమజ్జనం కోసం తరలిస్తున్నారు.
మహాగణపతి నిమజ్జనానికి క్రేన్ నంబర్-4 సిద్ధం చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలలోపు నిమజ్జనం పూర్తి కానుంది. శోభాయాత్ర మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్ బండ్ సహా.. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌కు విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుందన్నారు పోలీసు అధికారులు.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, NTR మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ఖైరతాబాద్, తెలుగుతల్లి, లిబర్టీ, MJ మార్కెట్, GPO వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

