పెళ్లిళ్ల భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
శుభకార్యాలు, పెళ్లిళ్ల విందు భోజనాల్లో వడ్డించే శాకాహార వంటకాల్లో 'క్యాబేజీ క్యారెట్ వేపుడు' చాలా ప్రత్యేకమైనది. ఇంట్లో సాధారణంగా క్యాబేజీ కూర వండితే ఆ సహజ వాసన నచ్చక పిల్లలు, పెద్దలు తినడానికి అంతగా మక్కువ చూపించరు. కానీ ఫంక్షన్లలో చేసే క్యాబేజీ వేపుడులో ఎలాంటి పచ్చి వాసన ఉండకపోగా.. పచ్చికొబ్బరి కమ్మదనం, అల్లం పచ్చిమిర్చి ఘాటుతో ఎంతో రుచిగా ఉంటుంది. క్యాబేజీలోని ఫైబర్, క్యారెట్‌లోని విటమిన్-ఎ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
