AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ అలసటగా అనిపిస్తోందా? మీ శరీరానికి కావాల్సిన టాప్ 5 ఎనర్జీ బూస్టర్లు ఇవే

రోజూ నీరసం, అలసట వేధిస్తున్నాయని వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి విటమిన్ ట్యాబ్లెట్ లు వాడుతున్నారా? అయితే జాగ్రత్త మన వంటింట్లో లభించే ఆహార పదార్థాలు, రోజువారీ అలవాట్లతోనే ఈ 5 రకాల పోషకాలను సహజంగా పొందవచ్చు. ఎలాంటి మందులు వాడకుండానే శరీరానికి తగినంత ఎనర్జీని అందించి రోజంతా యాక్టివ్‌గా ఉండే మార్గాలు మన రోజు జీవితం లోనే ఉన్నాయి.అవేంటో తెలుసుకుందాం.

Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 5:29 PM

Share
బి-కాంప్లెక్స్.. సహజ ఆహారాల ద్వారా అంటే రోజువారి ఫుడ్ అయిన గుడ్లు, పాలు, పెరుగు, ఆకుకూరలో పాలకూర, తోటకూర, పప్పుధాన్యాలు,గోధుమలు, బ్రౌన్ రైస్, మరియు బాదం, వేరుశనగల్లో విటమిన్ B ఉంటుంది.ఈ ఆహారాలు రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం మనం తినే ఆహారాన్ని సులభంగా శక్తిగా మారుస్తుంది.

1 / 6
విటమిన్ డి...ఇది ఉచితంగా లభించే వరం. ఉదయం పూట పడే సూర్యరశ్మి విటమిన్ ' డి కి అద్భుతమైన వనరు.పెద్దగా కష్ట పడకుండా ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల మధ్య కనీసం 15-20 నిమిషాలు ఉదయం ఎండలో నిలబడాలి. దీనితో పాటు గుడ్డులోని పచ్చసొన, పుట్టగొడుగులు మరియు పాల ఉత్పత్తుల ద్వారా కూడా విటమిన్ డి లభిస్తుంది.

2 / 6
 ఐరన్...రక్తహీనతకు చెక్ పెట్టి శక్తినిచ్చే ఆహారాలు అయిన ఖర్జూరాలు, బెల్లం, అంజీర్, దానిమ్మ, బీట్‌రూట్, మునగాకు, నువ్వులు మరియు రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ ఒంటపట్టాలంటే విటమిన్ సి అవసరం. కాబట్టి ఆకుకూరలు లేదా ఐరన్ ఉన్న ఆహారం తీసుకునేటప్పుడు కాస్త నిమ్మరసం కలుపుకోవడం మంచిది.

3 / 6
మెగ్నీషియం.. దీనికోసం నట్స్ మరియు గింజలు తినాలి. గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, అరటిపండ్లు, కాకరకాయ, డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోజూ గుప్పెడు తినడం వల్ల కండరాల అలసట తగ్గి, మంచి నిద్ర పడుతుంది. ఇది ఎనర్జీ లెవల్స్‌ను వేగంగా పెంచుతుంది.

4 / 6
కోఎంజైమ్... స్టామిమా మరియు హృదయ ఆరోగ్యం బాగా ఉండాలి అంటే చేపలు,సోయాబీన్స్, పప్పులు, బ్రోకలీ, క్యాలిఫ్లవర్ మరియు వేరుశనగల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, యోగా మరియు ప్రాణాయామం వల్ల శరీరంలో కణాల స్థాయి శక్తి సహజంగానే పెరుగుతుంది.

5 / 6
వీటి తో పాటు శక్తిని పెంచే కొన్ని ముఖ్యమైన నియమాలు మంచి నిద్ర.. రోజుకు 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర శరీరానికి సహజమైన రీఛార్జ్. పుష్కలంగా నీరు తాగడం డీహైడ్రేషన్ వల్ల కూడా తీవ్ర అలసట వస్తుంది. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. జంక్ ఫుడ్ తగ్గించడం.. మైదా, అధిక చక్కెర ఉన్న పదార్థాలు తక్షణ శక్తిని ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత నీరసాన్ని పెంచుతాయి. సహజమైన ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం పాటించడం ద్వారా ఎలాంటి సప్లిమెంట్లు లేకుండానే మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచుకోవచ్చు అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

6 / 6
Follow Us