మ్యాజిక్ పౌడర్.. మొక్కకు ఇదొక్కటి వేస్తే పూలు విరగపూయాల్సిందే

 24 Sep 2026

Anand T

పండు తిన్న తర్వాత అరటి తొక్కను చాలా మంది వేస్ట్‌గా పడేస్తారు. కానీ దానితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నయో తెలిస్తే ఈ సారి అస్సలు అలా చేయరు.

అరటి తొక్క

అరటి తొక్కలను పెరట్లోని మొక్కలకు ఎరువుగా మార్చుకోవచ్చు. వీటిలో ఉండే పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి.

మొక్కలకు మేలు

అయితే పచ్చి తొక్కలను నేరుగా కుండీలలో వేయరాదు. ఇలా చేస్తే మట్టిలోని సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిని.. హానికరమైన బ్యాక్టీరియా పెరిగి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.

నేరుగా వేయొద్దు

కాబట్టి అరటి తొక్కలను ఫస్ట్ ఎరువుగా మర్చుకోండి, ఇందుకోసం అరటి తొక్కలను చిన్న ముక్కలుగా కోసి, ఒక లీటరు నీటిలో 3 రోజులు నానబెట్టండి. తర్వాత ఆ పోషకాల నీటిని వడకట్టి నేరుగా మొక్కల వేర్లకు పోయండి.

అరటి నీరు

ఇలా చేయడం వల్ల పొటాషియం, ఇతర ఖనిజాలు త్వరగా నీటిలో కలుస్తాయి. ఈ 'లిక్విడ్ టీ'ని మట్టిలో పోయడం వల్ల, ఎలాంటి ఈగలు దరిచేరకుండానే మొక్కలు పచ్చగా పెరగడంతో పాటు కాపు కూడా స్పీడ్‌గా వస్తుంది.

అరటి నీరు బెనిఫిట్స్

మరో పద్దతి ఏంటంటే తొక్కలను బాగా ఎండబెట్టండి. వాటిని మిక్సీలో వేసి మెత్తటి సేంద్రియ ఎరువు పొడిగా మార్చండి. దీనిని గాలి చొరబడని డబ్బాలో సురక్షితంగా నిల్వ చేసుకొని నెలవారీగా వాడుకోవచ్చు.

అరటి పొడి

కుండీలోని పై మట్టిని కొద్దిగా వదులు చేసి, నెలకు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ అరటి తొక్కల పొడిని కలపండి. ఇలా చేయడం వల్ల మొక్కలకు కావాల్సిన పొటాషియం పుష్కలంగా అందుతుంది.

వాడే పద్దతి

మీరు ఇంట్లో కంపోస్ట్ బిన్ నిర్వహిస్తుంటే, అకటి తొక్కను ముక్కలుగా కోసి ఎండుటాకులతో కలపడం వల్ల ఇవి త్వరగా కుళ్ళిపోయి, మొక్కల కోసం సమతుల్యమైన కంపోస్ట్ తయారవుతుంది.దీనిని మొక్కలకు వేస్తే అవి త్వరగా పెరుగుతాయి.

కంపోస్ట్ తయారీ