AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar 2026: తులా రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి కష్టనష్టాల నుంచి విముక్తి

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహ సంచారంలో బుదుడి రాశి మార్పు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. తెలివితేటలు, నైపుణ్యాలు పెరగడం, సమస్యలు పరిష్కారం కావడం వంటివి బుధుడి వల్లే సాధ్యమవుతాయి. ఈ నెల(సెప్టెంబర్) 26 నుంచి డిసెంబర్ 1 వరకు బుధుడు తన మిత్ర క్షేత్రమైన తులా రాశిలో సంచరించడం జరుగుతుంది. వ్యాపారాలకు, సంపాదనకు, నైపుణ్యాలకు, తెలివితేటలకు, ప్లానింగుకు కారకుడైన బుధుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక స్థిరత్వాలు కలుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 5:47 PM

Share
మిథున రాశి: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు తనకు పంచమ స్థానమైన తులా రాశిలో సంచారం చేయడం ఈ రాశివారు ఎటువంటి పోటీలోనైనా రాణిస్తారు. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేసి మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్ని కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగాల్లో సమర్థతను నిరూపించుకుని లబ్ధి పొందుతారు.

1 / 6
కర్కాటక రాశి: ఈ రాశికి నాలుగవ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నంత కాలం సుఖ సంతోషాలకు, మనశ్శాంతికి కొదవ ఉండదు. ఆస్తివివాదాలు, వ్యవహారాలు చక్కబడతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో హోదా  పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. తల్లి నుంచి సహాయ సహ కారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి.

2 / 6
కన్య రాశి: రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా అనేక ప్రయోజనాలు, లాభాలు పొందుతారు. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతో షాలు వెల్లివిరు స్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, అప్రయత్న ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాటపడతాయి. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి.

3 / 6
తులా రాశి: ఈ రాశిలో బుధ సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరి స్థితి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.

4 / 6
ధనుస్సు రాశి: ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదా యక వ్యవహారాలు చేపడతారు. ముఖ్యంగా లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు వేతనాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది.

5 / 6
మకర రాశి: ఈ రాశికి దశమంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంబంధమైన ప్రతి ప్రయత్నమూ విజయవంతమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగు తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడా నికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పేరు ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

6 / 6
Follow Us