అలాంటి సీన్స్ వద్దన్నా.. ఎన్నో సినిమాలు వదిలేశా.. కాజల్..

Rajitha Chanti

Pic credit - Instagram

31  July 2026

దక్షిణాదిలో దాదాపు రెండు దశాబ్దాలుగా నటిగా ముద్ర వేసుకున్న చందమామ కాజల్..మాతృత్వం తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. 

గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అలరిస్తూ మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

ఇటీవల తన నూతన చిత్రం 'ది ఇండియా స్టోరీ' ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కాజల్ తన కెరీర్ పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

కెరీర్ ప్రారంభం నుంచే తనకు కొన్ని వ్యక్తిగత పరిమితులు ఉన్నాయని కాజల్ చెప్పారు. ఎప్పుడూ ఆ హద్దులను దాటలేదని స్పష్టం చేశారు.

నా కెరీర్‌లో ఇప్పటివరకు బికినీ ధరించలేదు. నాభి అందాలను ప్రత్యేకంగా ఎలివేట్ చేసే సీన్లు కానీ, ఇంటిమేట్ సీన్లు కానీ చేయలేదన్నారు కాజల్. 

అసౌకర్యంగా అనిపించే సన్నివేశాల వల్ల కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా వదులుకోవాల్సి వచ్చిందని.. ఎన్నో సినిమాలు వదిలేశానని అన్నారు. 

రేపు నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసినప్పుడు గర్వపడాలి కానీ, ఎక్కడా అసౌకర్యానికి గురికాకూడదు అని తెలిపారు కాజల్ 

అయితే ఇది తన వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, ఇతర నటీమణుల ఎంపికలను తాను ఎప్పుడూ తప్పుబట్టనని విస్పష్టంగా చెప్పారు.