ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ గ్యారేజీలో చెలరేగిన మంటలు.. కాలిబూదైన BYD కార్లు..!
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి భద్రతపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చైనాలోని షెన్‌జెన్‌లో ఉన్న బీవైడీ (BYD) సంస్థకు చెందిన ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. అయితే, ఈ ఘటనకు కారణం బ్యాటరీ లోపం కాదని కంపెనీ చెబుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి భద్రతపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చైనాలోని షెన్‌జెన్‌లో ఉన్న బీవైడీ (BYD) సంస్థకు చెందిన ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఈ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. అయితే, ఈ ఘటనకు కారణం బ్యాటరీ లోపం కాదని కంపెనీ చెబుతోంది.
షెన్‌జెన్‌లోని పింగ్‌షాన్ జిల్లాలో ఉన్న బీవైడీ క్యాంపస్‌లోని ఒక పార్కింగ్ ఏరియాలో ఈ మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో టెస్టింగ్ కోసం ఉంచిన కొన్ని వాహనాలు ఉండటంతో, మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రాణనష్టం తప్పింది. అయినప్పటికీ, ఈ వార్తతో హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో బీవైడీ షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.
సాధారణంగా ఈవీ ప్రమాదాలు అనగానే అందరి దృష్టి బ్యాటరీల వైపు మళ్లుతుంది. కానీ, బీవైడీ యాజమాన్యం, స్థానిక అగ్నిమాపక శాఖ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి వాహనాలు గానీ, బ్యాటరీల సెల్ఫ్-ఇగ్నిషన్ గానీ కారణం కాదని స్పష్టమైంది. పార్కింగ్ ఏరియా సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో జరిగిన పొరపాట్ల వల్లే ఈ మంటలు చెలరేగాయని నిర్ధారించారు. అయినప్పటికీ ఫ్యాక్టరీలోని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదు. కస్టమర్లకు డెలివరీ చేయాల్సిన వాహనాలు సురక్షితంగా ఉన్నాయని సంస్థ ప్రకటించింది.
బ్యాటరీ వాహనాలపై ప్రజల్లో ఉన్న భయం పోగొట్టేందుకు నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. బీవైడీ వంటి సంస్థలు ప్రస్తుతం ‘లిథియం ఐరన్ ఫాస్ఫేట్’ (LFP) ఆధారిత బ్లేడ్ బ్యాటరీలను వాడుతున్నాయి. ఇవి సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవు. సురక్షితమైనవని నిపుణులు అంటున్నారు. ఆధునిక ఈవీలలో బ్యాటరీ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు అత్యాధునిక కూలింగ్ వ్యవస్థలు ఉంటున్నాయి.
ఈవీలలో మంటలు రాగానే అది బ్యాటరీ లోపమే అని భయపడాల్సిన అవసరం లేదని, ఇది ఒక ప్రమాదం మాత్రమేనని చైనా అధికారులు తెలిపారు.. చైనా ప్రమాదంలో తేలినట్లుగా, బాహ్య కారణాలు కూడా ప్రమాదాలకు దారితీయవచ్చు. ఏది ఏమైనా, కంపెనీలు భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడం ద్వారా వినియోగదారుల్లో భరోసా కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
