‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..
సంక్రాంతి తర్వాత కళతప్పిన థియేటర్లకు రామ్ చరణ్ పెద్ది సినిమా ఊపిరి పోస్తుందని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. జూన్ 3న ప్రీమియర్ షోలు, జూన్ 4 నుండి ఐదు షోలకు పర్మిషన్ లభించింది. ఈ చిత్రానికి రికార్డు ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సంక్రాంతి పండుగ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల వద్ద సందడి తగ్గింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని కొన్ని చిత్రాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం విడుదల కాబోతుంది. డిస్ట్రిబ్యూటర్లు ,ఎగ్జిబిటర్లు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ది చిత్రానికి టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటల తర్వాత ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవచ్చు. ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా 600 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే జూన్ 4 నుండి 10 రోజుల పాటు రోజుకు ఐదు షోలకు అనుమతి లభించింది.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

