కడప జిల్లా గోపవరం మండలం పీపికుంట అటవీ ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుండి కడపకు వెళ్తున్న బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులకు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడం అందరికీ ఊరటనిచ్చింది.