వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, ముమ్మల్లపల్లి వద్ద జాతీయ రహదారి 44 పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొత్తిమీర పుదీనా లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించారు.