AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు కూలీలు మృతి

పక్క రాష్ట్రం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. బాధితులంతా రోజువారి కూలీలుగా పోలీసులు గుర్తించారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు కూలీలు మృతి
Karnataka Road Accident
Anand T
|

Updated on: May 31, 2026 | 7:34 PM

Share

కూళీ పనులు ముగించుకొన ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపుర జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కూలీలు పనులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. అయితే ఆటో బాగేపల్లి సమీపంలోని సుంకాలమ్మ దేవాలయం వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఆ కంటైనర్ మరో వాహనాన్ని ఢీకొట్టింది.

వెనక ముందు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఆటో రెండు వాహనాల మధ్యలో చిక్కుకొని నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమాదేవి (55), విజయమ్మ (40), లక్ష్మమ్మ (50), సరోజమ్మ (43) సహా ఆటో డ్రైవర్ అంజినప్ప (33) సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మిగతా వాహనాల్లో ఉన్న మరో 10 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఆటోలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే గాయాలతో హాస్పిటల్‌లో చేరిన మరో వ్యక్తి కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us