AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20ల్లో టీమిండియా సరికొత్త శకం.. ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!

India vs Ireland T20 Series: భారత క్రికెట్‌లో భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసే క్రమంలో ఐర్లాండ్ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. వైభవ్ సూర్యవంశీ విస్ఫోటక బ్యాటింగ్, ప్రిన్స్ యాదవ్ పదునైన బౌలింగ్ విదేశీ పిచ్‌లపై ఎలా పనిచేస్తాయనేది చూడాలి. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ యువ రక్తాన్ని నమ్ముకుని సిరీస్ బోణీ కొట్టాలని చూస్తుండగా, అభిమానులు మాత్రం ఈ ఇద్దరి అరంగేట్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

టీ20ల్లో టీమిండియా సరికొత్త శకం.. ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
Team IndiaImage Credit source: BCCI
Venkata Chari
|

Updated on: Jun 23, 2026 | 11:19 PM

Share

India vs Ireland T20 Series: టి20 ప్రపంచకప్ చారిత్రాత్మక విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టబోతోంది. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో యువ భారతం ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమైంది. జూన్ 26 నుంచి బెల్‌ఫాస్ట్‌లో ప్రారంభం కానున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐపీఎల్ 2026 సెన్సేషన్స్ వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి సర్వం సిద్ధమైంది.

సరికొత్త బాధ్యతలు.. యువ భారతం సరికొత్త లక్ష్యాలు..

భారత దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన కుర్రాళ్లతో టీమిండియా ఇప్పుడు సరికొత్తగా రూపాంతరం చెందింది. మొన్నటివరకు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉన్న టీ20 సారథ్య బాధ్యతలు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భుజాలపైకి వచ్చాయి. అంతేకాదు, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మకు బాధ్యతలు అప్పగించడం విశేషం. కొత్త కెప్టెన్, కొత్త డిప్యూటీల ఆధ్వర్యంలో విదేశీ గడ్డపై ఐర్లాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. బెల్‌ఫాస్ట్ వేదికగా జూన్ 26న జరగబోయే తొలి మ్యాచ్‌లో తుది జట్టు ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన ఇద్దరు యువ కిరణాలు ఈ మ్యాచ్‌తో బ్లూ జెర్సీ ధరించడం దాదాపు ఖాయమైంది.

15 ఏళ్ల వయసు.. సిక్సర్ల విధ్వంసం.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?

భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించేందుకు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంగిట నిలిచాడు. అత్యంత పిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన ఘనత సాధించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇప్పుడు భారత్ తరఫున బరిలోకి దిగబోయే అత్యంత యువ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. వైభవ్ బ్యాటింగ్ శైలి చూస్తే సీనియర్ బ్యాటర్లు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. మైదానంలోకి దిగాడంటే చాలు బౌలర్ ఎవరనేది చూడకుండా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ చిన్నోడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. కేవలం 16 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ సీజన్‌లో అతని బ్యాట్ నుంచి 63 ఫోర్లు, ఏకంగా 72 సిక్సర్లు జాలువారాయి. ఈ అద్భుతమైన ఫామ్ నేపథ్యంలో ఐర్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా వైభవ్ విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. లక్నో ఎక్స్‌ప్రెస్ ప్రిన్స్ యాదవ్..

వైభవ్‌తో పాటు తొలి మ్యాచ్‌లోనే క్యాప్ అందుకోనున్న మరో అస్త్రం ప్రిన్స్ యాదవ్. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్, ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున నిలకడైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. లక్నో తరపున 14 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు.

ప్రిన్స్ యాదవ్ ప్రత్యేకత ఏమిటంటే.. మ్యాచ్‌లో ఏ ఓవర్లలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలడు. పవర్‌ప్లేలో స్వింగ్‌తో ఇబ్బంది పెట్టడమే కాకుండా, డెత్ ఓవర్లలో ఖచ్చితమైన యార్కర్లు, బౌన్సర్లు, స్లోయర్ వన్లతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో ఇతను దిట్ట. ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం రాలేదు, కానీ ఐర్లాండ్ పర్యటనలో మాత్రం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇతనికి తుది జట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us