AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమెరా వెనక నుంచి హీరోగా.. లోకేష్ కనకరాజ్‌తో పాటు సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు వీళ్లే!

కెమెరా వెనక నుంచి హీరోగా.. లోకేష్ కనకరాజ్‌తో పాటు సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు వీళ్లే!

Phani CH
|

Updated on: Aug 11, 2026 | 11:35 AM

Share

దర్శకులు హీరోలుగా మారి విజయాలు సాధించడం అరుదైన విషయమే. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ ‘డీసీ’తో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రిషబ్ శెట్టి ‘కాంతార’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఉపేంద్ర, ఎస్.జే. సూర్య, తరుణ్ భాస్కర్, అభిషన్ జీవింత్ వంటి దర్శకులు కూడా కెమెరా ముందు విజయవంతమయ్యారు. దీంతో డైరెక్టర్-టు-హీరో ట్రెండ్‌పై ఆసక్తి పెరుగుతోంది.

హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అవ్వడం కామన్.. ఇప్పుడూ జరుగుతుంది గతంలోనూ చాలాసార్లు జరిగింది. కానీ దర్శకులు హీరోలుగా మారి సక్సెస్ కొట్టడం అరుదుగా జరుగుతుంటుంది.. ఏ పుష్కరానికో అలాంటి విచిత్రం జరుగుతుంటుంది. ఓ స్టార్ డైరెక్టర్ బాక్సాఫీస్‌ను హీరోగా ఇలాగే రూల్ చేస్తున్నాడిప్పుడు. మరి అతనెవరు.. అసలలా సక్సెస్ అయిన దర్శకులెవరు..? కెమెరా వెనక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు.. కెమెరా ముందు నటించడం తెలియదా చెప్పండి..? వాళ్లకు తగ్గ స్క్రిప్ట్ పడితే బాక్సాఫీస్ మోత మోగిపోతుంది. తాజాగా లోకేష్ కనకరాజ్ డిసితో ఇదే చేస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా చాలా బ్లాక్‌బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. దెబ్బకు లోకేష్ కూడా హీరోగా సెటిల్ అయ్యేలా ఉన్నారు.. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసారిందులో..! మౌత్ టాక్‌తోనే డిసి రేంజ్ పెరుగుతుంది.. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మ్యాజిక్ చేస్తుంది. చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రను అంతే అద్భుతంగా చేసారు లోకేష్. ఇక ప్రదీప్ రంగనాథన్ కూడా ఇలాగే ముందు దర్శకుడిగా సక్సెస్ అయి.. హీరోగా రప్ఫాడిస్తున్నారిప్పుడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ లాంటి సినిమాలతో స్టార్ అయ్యారు ప్రదీప్. ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన రిషబ్ శెట్టి ముందు దర్శకుడే. కిరిక్ పార్టీ లాంటి సంచలన సినిమాని తెరకెక్కించింది ఈయనే. ఇక కాంతారతో ఆయనే హీరోగా మారిపోయారు. ఇప్పుడు వేరే వాళ్ల దర్శకత్వంలో నటిస్తున్నారు రిషబ్. ప్రస్తుతం జై హనుమాన్‌తో పాటు శివాజీ బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నారు ఈ హీరో కమ్ డైరెక్టర్. కన్నడ ఇండస్ట్రీ నుంచే ఉపేంద్ర కూడా ఇలాగే డైరెక్టర్ నుంచి హీరోగా మారి స్టార్ అయ్యారు. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలన్నీ ట్రెండ్ సెట్టర్సే. తమిళంలో ఎస్ జే సూర్య కూడా నాని రీమేక్ న్యూ సినిమాతో హీరో అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసారు. ఇక తరుణ్ భాస్కర్, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఫేమ్ అభిషన్ జీవింత్ లాంటి దర్శకులు కూడా హీరోలుగా సక్సెస్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు.. రంగంలోకి బీసీసీఐ పెద్దలు!

వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు

గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు

సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!

అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

Follow Us