AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వీళ్లు జామకాయలు అస్సలు తినకూడదు.. చాలా డేంజర్! శరీరంలో జరిగేది తెలిస్తే..

జామపండును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది సరసమైన ధరలో లభించే ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. జామపండు పోషకాలు, విటమిన్ C, పీచు పదార్థం సమృద్ధిగా ఉండే అద్భుతమైన పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, అమితంగా తింటే ఏదీ మంచిది కాదన్నట్లుగానే.. జామపండును కూడా మితిమీరి తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జామపండు వల్ల కలిగే 5 ప్రధాన దుష్ప్రభావాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 11, 2026 | 9:24 PM

Share
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు: జామపండులో పీచు పదార్థం, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. మన శరీరం ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేసుకోవడం కష్టం. దీనివల్ల పొట్టలో గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.

1 / 5
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది: జామపండులో పొటాషియం, విటమిన్ C స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. జామ గింజలు జీర్ణం కావడం కాస్త కష్టం కాబట్టి కిడ్నీ రోగులు వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.

2 / 5
రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం: పండుగా ఉన్న జామపండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉన్నప్పటికీ, మితిమీరి తింటే అందులోని సహజ చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో మార్పులు రావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక చిన్న జామపండు కంటే ఎక్కువ తినకూడదు.

3 / 5
పంటి నొప్పులు, సున్నితత్వం: దంత సమస్యలు లేదా చిగుళ్ల నొప్పులు ఉన్నవారు గట్టిగా ఉండే పచ్చి జామకాయలను నమిలినప్పుడు పంటి నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే జామ గింజలు పండ్ల సందుల్లో ఇరుక్కుని అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

4 / 5
విరేచనాలు: జామపండ్లలో విటమిన్ సి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి 3-4 జామపండ్లను తింటే, శరీరంలో ఫైబర్ పరిమాణం పెరిగి లూజ్ మోషన్స్ లేదా విరేచనాలకు దారితీయవచ్చు. ఏదైనా పండును పరిమితంగా తిన్నప్పుడే దాని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి. రోజుకు ఒకటి లేదా రెండు జామపండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినడం సురక్షితం. రాత్రి వేళల్లో మరియు ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిది.

5 / 5
Follow Us
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!

ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్

కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..