AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఒకప్పుడు చెత్త సామానులు అమ్మాడు.. బిగ్ బాస్10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ నరేష్

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అలియాస్ పొట్టి నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదివిన నరేష్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడని మీకు తెలుసా?

Bigg Boss Telugu 10: ఒకప్పుడు చెత్త సామానులు అమ్మాడు.. బిగ్ బాస్10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ నరేష్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 9:48 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి మరో జబర్దస్త్ కమెడియన్ ఎంట్రీ ఇచ్చాడు. పొట్టిగా ఉన్నా గట్టిగా కామెడీ పంచులు వేసే నరేష్ అలియాస్ పొట్టి నరేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 11వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. అలాగే కచ్చితంగా  బిగ్ బాస్ కప్పు కొడతా అని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై గూగుల్ లో తన పేరు కొడితే బిగ్ బాస్ నరేష్ అని రావాలని.. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని నరేష్ చెప్పుకొచ్చాడు. కాగా జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. తన కామెడీ పంచులతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అయితే ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే నరేష్ జీవితంలోనూ చాలా కన్నీటి కష్టాలున్నాయి. అతను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు. హైట్ తక్కువగా ఉన్నాడన్న కారణంతో తీవ్ర అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. కాగా ఒక ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు నరేష్. ‘నేను తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాను. నాన్న స్క్రాప్ (చెత్త) బిజినెస్ చేసేవారు. చివరకు మాకు, మా చుట్టాలకు చాలా మందికి అదే బిజినెస్. నేను కూడా ఆ పనే చేశాను. పాత పేపర్లు, ఇనుము, బీర్ బాటిల్స్.. ఇలా చెత్త ఐటమ్స్ కొని అమ్మాను’ అని ఎమోషనల్ అయ్యాడు నరేష్.

ఇక ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. ‘ నేను ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకున్నాను. ఢీ జూనియర్స్ ఆడిషన్స్ కు కూడా వెళ్లాను. కానీ అక్కడ నన్ను రిజెక్ట్ చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రొడక్షన్ మేనేజర్ నా నంబర్ తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ షూట్ ఉన్నప్పుడు పిలిచాడు. అప్పుడు సుధాకర్ అన్న నన్ను చూసి ఒక స్కిట్ లో వేషం ఇప్పించాడు. ఆ తర్వాత ప్రకాష్‌, బుల్లెట్ భాస్కర్, సుధాకర్ టీమ్స్ లలో చేశాను’ అని చెప్పుకొచ్చాడు నరేష్. మరి జబర్దస్త్ ను వదిలేసిన నరేష్ బిగ్ బాస్ లో ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఇస్తాడో చూడాలి.

కచ్చితంగా బిగ్ బాస్ కప్పు కొడతానంటోన్న జబ్దస్త్ నరేష్..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్
ఇకపై గూగుల్ నా పేరు కొడితే అదే రావాలి.. బిగ్ బాస్ ఎంట్రీపై నరేష్
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పెళ్లైన 6 రోజులకే వరుడు..
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
జూనియర్ ఆర్టిస్ట్‌గా రూ. 600తో మొదలు పెట్టి.. ఇప్పుడు ఇలా
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
పాత బెడ్‌షీట్‌తో ఇన్ని ఉపయోగాలా? ఇంట్లో ఇలా రీయూజ్ చేసుకోండి!
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
బిగ్‌బాస్ 10 ఎనిమిదో కంటెస్టెంట్‌గా షాలినీ పటేల్.. అసలు ఎవరీమే?
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తుక్కుగూడ నర్సు హత్య కేసు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
హౌస్‌లోకి ఎంట్రీఇచ్చిన చైత్ర రాయ్ గురించి ఈ విషయాలు తెలుసా
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తే మంచిది? దేవతలకు ఇష్టమైన ప్రత్యేక..
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?
బిగ్‌బాస్‌లోకి జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఎంట్రీ.. ఈ విషయాలు తెలుసా?