AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?

గతంలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన యాంకర్లలో ఒక్క శ్రీముఖి మాత్రమే సత్తా చాటింది. రన్నరప్ వరకు వెళ్లింది. మరి ఇప్పుడు వర్షిణీ కూడా అలాగే సత్తా చాటుతుందా? సినిమాలతో పాటు బుల్లితెరపైనా సత్తా చాటిన ఈ గ్లామరస్ యాంకర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ 10లోకి అడుగు పెట్టిన అందాల యాంకరమ్మ.. శ్రీముఖిలా వర్షిణీ సత్తా చాటుతుందా?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 10:46 PM

Share

ఎట్టకేలకు స్టార్ యాంకర్ వర్షిణీ సౌందరరాజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడుతున్నామంటే.. గతంలో పలు సీజన్లు మొదలయ్యే టైంలో ఈ యాంకరమ్మ పేరు తెగ వినిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ చివరలో కంటెస్టెంట్ల జాబితాలో ముద్దుగుమ్మ పేరు అసలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు 10వ సీజన్‌లో   కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ. ‘ బి గ్ బాస్ అనేది  చాలా పెద్ద ఫ్లాట్‌ఫాం అని. నేను ఇక్కడ ఫిట్‌ అవుతానని అనుకోలేదు. ఈ విషయమై రోజు రాత్రి నిద్రపోయే ముందు తనని తాను ప్రశ్నించుకునేదాన్ని.  ఆ తర్వాతే  ఈసారి  కచ్చితంగా బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది వర్షిణీ. క ఇక ఈ యాంకరమ్మ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఓ తమిళ కుటుంబంలో పుట్టింది. బుల్లితెరకు రాకముందే వెండితెరపై కనిపించింది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసిన ‘చందమామ కథలు’ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది వర్షిణీ.  దీని తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్లీ మొదలైంది, శాకుంతలం, ఏనుగు తొండన ఘటికాచలం తదితర సినిమాల్లో నటించింది. అలాగే  ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌లోనూ మెయిన్ లీడ్ చేసింది.

ఇక బుల్లితెరపై యాంకర్ గానూ, హోస్ట్ గానూ సత్తా చాటింది వర్షిణీ.  ఢీ, పటాస్ 2, కామెడీ స్టార్స్, సిక్స్ సెన్త్ సీజన్ 4, భలే ఛాన్సులే, జబర్దస్త్, అలీతో సరదాగా షోల్లోనూ సందడి చేసింది. కాగా సినిమాలు, టీవీ షోలతో పాటు ఇతర విషయాలతోనూ వార్తల్లో నిలిచింది వర్షిణీ. ముఖ్యంగా  టీమిండియా  ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తో ప్రేమాయణం నడిపిందని రూమర్స్ కూడా వినిపించాయి.  అలాగే ఒక టీవీ షో డైరెక్టర్‌తోనూ ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. కాగా ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు  టీవీ షోలేం చేయట్లేదు వర్షిణీ. ఈ క్రమంలోనే  బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆమె ఇక్కడ సత్తా చాటి మళ్లీ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిస్తోంది.

బిగ్ బాస్ షోతో వర్షిణీ బౌన్స్ బ్యాక్ అయ్యేనా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!