శ్రీ కృష్ణాష్టమి
శ్రావణ మాసం జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణాష్టమికి విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజు ప్రపంచానికి సకల ధర్మాలను తెలియజేస్తున్న భగవద్గీతను అందజేసిన శ్రీ కృష్ణుడి జన్మదినం. దీనినే గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణ పక్షం అష్టమి తిథి, రోహిణి నక్ష్తత్రం లగ్నలో అర్ధరాత్రి దేవకి-వసుదేవుడు దంపతులకు కృష్ణుడు జన్మించాడు. ఈ రోజు అత్యంత పర్వదినం..ఈ రోజున బాల కృష్ణుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. సంతానం లేని దంపతులు గోపాలున్ని పూజిస్తే సంతానప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. అందుకనే శ్రీకృష్ణాష్టమి వస్తోందంటే చాలు దేశ వ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పండగ అంటే సందడి అంతా పిల్లలదే అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడి రూపంలో సందడి చేస్తారు.
దేవకీ గర్భాన జన్మించి.. యశోద ఇంటి పెరిగిన చిన్ని కృష్ణుడు వెన్న దొంగగా అందరి మనసుని దోచుకున్నాడు. చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. గోప బాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మసంరక్షకుడిగా.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం లోక కల్యాణం ఆయుధం పట్టకుండా కురుక్షేత్రాన్ని నడిపించిన కృష్ణుడి జన్మాష్టమి అందరికీ ఇష్టమైన పండగ. అల్లరి కృష్ణయ్య.. అందరికీ ఇష్టమైన కన్నయ్య జన్మదినోత్సవాన్ని ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీ శనివారం జరుపుకోనున్నారు.
Tollywood: ఫొటో స్టిల్ కాదు.. ఈ టాలీవుడ్ హీరోయిన్ పిల్లన గ్రోవిని ఎంత బాగా వాయించిందో మీరే చూడండి.. వీడియో
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చాలా మంది పిల్లలు కృష్ణువులుగా ముస్తాబయ్యారు. ఇక అమ్మాయిలైతే రాధ, గోపికలుగా తయారై తెగ సందడి చేశారు. అలా ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా గోపికగా ఎంతో అందంగా ముస్తాబైంది. అంతేకాదు కృష్ణుని వలే పిల్లన గ్రోవి (వేణువు) కూడా వాయించింది.
- Basha Shek
- Updated on: Aug 17, 2025
- 7:33 pm
Tollywood: ఈ చిన్ని కృష్ణుడు, గోపికలు ఎవరో తెలుసా? 16 కోట్లతో 400 కోట్లు రాబట్టిన ఆ స్టార్ హీరో పిల్లలు
శనివారం (ఆగస్టు 16) శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ పిల్లలను శ్రీకృష్ణుడు, గోపికలుగా ముస్తాబు చేశారు. అలా ఓ స్టార్ హీరో దంపతులు కూడా తమ పిల్లలను కృష్ణుడు, గోపికలుగా అంందంగా రెడీ చేశారు.
- Basha Shek
- Updated on: Aug 18, 2025
- 11:43 am
Nithin: శ్రీకృష్ణాష్ణమి రోజున కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు.. బుడ్డోడు ఎంత క్యూట్ గా ఉన్నాడో!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. గతేడాది సెప్టెంబరులోనే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే చాలా మంది సెలబ్రిటీల్లాగే అతను కూడా ఇప్పటివరకు తన కొడుకు ఫొటోలు, వీడియోలు లాంటివి బయటపెట్టలేదు. కనీసం పేరు ఏం పెట్టారనేది కూడా చెప్పలేదు. అయితే శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు.
- Basha Shek
- Updated on: Aug 18, 2025
- 11:44 am
Lord Krishna: బాల్యం నుంచి కురుక్షేత్రం వరకు.. శ్రీకృష్ణుడి జీవితంలో తెలుసుకోవాల్సిన ఘట్టాలివే..
మన జీవితాల్లో ఎంతోమందికి శ్రీకృష్ణుడు ఒక ఆదర్శం. ఆయన బాల్యం, యుక్తవయస్సు, ధర్మ స్థాపన.. ప్రతి దశలోనూ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. భగవద్గీత జ్ఞానాన్ని బోధించి, కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలిపిన కృష్ణుడు, మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలను తన జీవితంలో దాచి ఉంచారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
- Bhavani
- Updated on: Aug 18, 2025
- 11:44 am
Tollywood: ఈ చిన్నికృష్ణుడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్.. మొదటి సినిమాకే జాతీయ అవార్డు
తెలంగాణకు చెందిన ఈ నటుడు కమ్ డైరెక్టర్ మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఆపై హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.
- Basha Shek
- Updated on: Aug 18, 2025
- 11:45 am
BAPS: శ్రీకృష్ణుడి జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.. మహంత్ స్వామి మహారాజ్ జన్మాష్టమి సందేశం
శ్రీ కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథ సారథిగా మారి, ద్రౌపదిని అవమానం నుండి కాపాడినట్లు BAPS సంస్థ ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ వివరించారు. గోకులలోని పిల్లలు, గోపికలతో ఆయన గడిపిన క్షణాలను భక్తులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని చెప్పారు.
- Krishna S
- Updated on: Aug 18, 2025
- 11:45 am
Janmashtami 2025: శ్రీ కృష్ణుడు కిరీటంలో నెమలి ఈకను ఎందుకు ధరిస్తాడు? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే..
శ్రీ కృష్ణునికి ఇష్టమైన అలంకరణ వస్తువుల్లో నెమలి ఈక ఒకటి. నెమలి ఈక కన్నయ్యకు ఒక గుర్తింపు.. భక్తిలో అంతర్భాగం. శ్రీ కృష్ణ కిరీటంలో అలంకరించబడిన నెమలి ఈక కేవలం అలంకరణ మాత్రమే కాదు.. దీనికి సంబంధించిన మూడు అద్భుతమైన పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. పురాణ గ్రంథాలలో నెమలి ఈక ప్రాముఖ్యత.. దానిని ఇంట్లో పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు కూడా వివరించాయి.
- Surya Kala
- Updated on: Aug 18, 2025
- 11:47 am
Janmashtami 2025: కన్నయ్య భక్తులా.. మన దేశంలో తప్పనిసరిగా చూడాల్సిన రాదా కృష్ణుల ఆలయాలు ఇవే..
భూమిమీద పాపా భారం పెరిగినప్పుడల్లా శ్రీ మహా విష్ణువు అవతారం దాల్చి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేస్తాడు. అలా శ్రీ మహా విష్ణువు అవతారాల్లో శ్రీ కృష్ణుడు అవతారం ఒకటి. ద్వారపర యుగంలో దేవకీనందుల శ్రావణ మాసం కృష్ణ పక్షం, అష్టమి తిథి రోజున జన్మించాడు. అందుకనే ప్రతి ఏడాది ఈ రోజున కన్నయ్య భక్తులు కృష్ణాష్టమి పండగను జరుపుకుంటారు. అయితే ప్రేమకు చిహ్నం ఎవరంటే రాధాకృష్ణులని చెబుతారు. మన దేశంలో రాధా-కృష్ణ దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం ప్రత్యేకతని సంతరించుకున్నాయి. మన దేశంలో సందర్శించాల్సిన 7 రాధా-కృష్ణ దేవాలయాల గురించి తెలుసుకుందాం..
- Surya Kala
- Updated on: Aug 16, 2025
- 9:51 am
Ayodya: రామ జన్మభూమిలో శ్రీ కృష్ణ జన్మోత్సవ వేడుకలు.. కన్నయ్యగా బాల రామయ్య దర్శనం
అయోధ్యలోని రామ జన్మభూమి సముదాయంలో కృష్ణ జన్మాష్టమికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. బాల రామయ్య గర్భగుడి ముందు శ్రీకృష్ణుని జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. ఆలయాన్ని పువ్వులు, దీపాలతో అలంకరించారు. బాల రామయ్యని ప్రత్యేకంగా అలంకరించి పసుపు రంగు దుస్తులను ధరింపజేయనున్నారు. కన్నయ్య జన్మదినం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు పూజ చేసి, పాటలు పాడతారు. అనంతరం పంజిరి ప్రసాదం పంపిణీ చేస్తారు.
- Surya Kala
- Updated on: Aug 18, 2025
- 11:48 am
వాస్తుటిప్స్: అదృష్టం కలిసి రావాలా.. అయితే కృష్ణాష్టమి రోజున ఇవి ఇంటికి తెచ్చుకోండి!
శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. భారతదేశం అంతటా శ్రీకృష్ణజన్మాష్టమిని ఆగస్టు 16 శనివారం రోజునం ఘనంగా జరుపుకుంటారు. అయితే వాస్తు ప్రకారం, ఈ రోజున కొన్ని రకాల వస్తువులను ఇంటిలోకి తెచ్చుకోవడం చాలా శుభ ప్రదం అంట. కాగా, ఇప్పుడు మనం శ్రీకృష్ణాష్టమి రోజున ఎలాంటి వస్తువులు ఇంటిలోకి తీసుకొచ్చుకోవాలో చూద్దాం!
- Samatha J
- Updated on: Aug 18, 2025
- 11:59 am