Nithin: శ్రీకృష్ణాష్ణమి రోజున కొడుకు పేరును రివీల్ చేసిన నితిన్ దంపతులు.. బుడ్డోడు ఎంత క్యూట్ గా ఉన్నాడో!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. గతేడాది సెప్టెంబరులోనే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే చాలా మంది సెలబ్రిటీల్లాగే అతను కూడా ఇప్పటివరకు తన కొడుకు ఫొటోలు, వీడియోలు లాంటివి బయటపెట్టలేదు. కనీసం పేరు ఏం పెట్టారనేది కూడా చెప్పలేదు. అయితే శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు.

టాలీవుడ్ లో యూత్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నితిన్ 2020లో షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా గతేడాది సెప్టెంబర్ 6న వీరి జీవితంలోకి ఒక పండంటి మగబిడ్డ అడుగు పెట్టాడు. ఈ శుభవార్తను అందరికీ చెప్పాడే కానీ చాలా మంది సెలబ్రిటీల్లాగే తన కుమారుడి ఫొటోలను బయట పెట్టలేదు. కనీసం తన తనయుడి పేరు కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు సుమారు 11 నెలల తర్వాత శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు నితిన్. అలాగే తన ముద్దుల కుమారుడికి ‘అవ్యుక్త్’ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నితిన్–షాలినీ దంపతులు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్ కు స్పందిస్తున్నారు. పేరు చాలా కొత్తగా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నితిన్ నుంచి హిట్ సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. ఈ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నాడీ క్రేజీ హీరో. ఈ ఏడాది మార్చిలో ‘రాబిన్ హుడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక గత నెలలో తమ్ముడు అనే మరో సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు నితిన్. ఇది కూడా ఆడియెన్స్ ను నిరాశపర్చింది. ప్రస్తుతం ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించే ‘ఎల్లమ్మ‘ మూవీలో హీరో నితిన్ గా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించవచ్చని టాక్. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
కుమారుడితో హీరో నితిన్..
View this post on Instagram
భార్య షాలినీ కందుకూరితో ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








