సంయుక్త స్పీడ్ మాములుగా లేదుగా.. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న కుర్ర భామ

Rajeev 

13  march 2026

సంయుక్త మీనన్.. టాలీవుడ్ లో ప్రస్తుతం కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది. 

భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే నటన పరంగా ఆకట్టుకుంది. 

 ఆ తర్వాత క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న బింబిసార‌ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిందీ అందాల తార.

 ధనుష్ తో చేసిన బై లింగ్వల్ మూవీ సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

ఇటీవలే వరుసగా రెండు హిట్స్ ఖాతాలో వేసుకుంది. బాలయ్య బాబుతో కలిసి అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

అలాగే యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి హిట్ అందుకుంది. 

ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఆగేలా కనిపించడం లేదు అంటున్నారు నెటిజన్స్.