హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ రోడ్ వద్ద అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గొర్రె తలతో క్షుద్రపూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయల ఆనవాళ్లు ఘటనాస్థలంలో కనిపించాయి. ఈ భయానక ఘటన స్థానికులను, ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.