సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ సొగసులు.. అరాచకమే..
Rajitha Chanti
Pic credit - Instagram
13 March 2026
బుల్లితెరపై ఈ సీరియల్ నటి చాలా ఫేమస్. ఎక్కువగా తల్లి పాత్రలలో కనిపించింది. సహజమైన నటన, పద్దతిగా కనిపించి ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించింది.
ఆమె మరెవరో కాదు జ్యోతి రాయ్. తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.
ఈ సీరియల్లో హీరోకు తల్లిగా జగతి మేడమ్ పాత్రలో సహజ నటనతో కట్టిపడేసింది. ఆ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత నెట్టింట గ్లామర్ క్వీన్ గా మారింది.
ప్రస్తుతం వెండితెరపై నటిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యింది ఈ నటి.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
అలాగే తన భర్త సుకు పూర్వజ్ దర్శకత్వంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. కిల్లర్ సినిమాలో బీభత్సమైన నటనతో కట్టిపడేసేందుకు రెడీ అయ్యింది జ్యోతి
తనకు సీరియల్స్ లో రోటిన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ తనను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారని అన్నారు
తాను ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న సినిమా చేస్తానని అనుకోలేదని తెలిపింది. విజయశాంతి లాగా తనకు యాక్షన్ సినిమాలు చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.