దక్షిణాదిలో అత్యధిక సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ హాన్సిక. ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.
బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగు, తమిళం భాషలలో నటించింది.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. తెలుగులో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది హాన్సిక.
నాలుగేళ్ల క్రితం తన స్నేహితురాలి భర్త సోహేల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు అతడితో విడాకులు తీసుకుంది. ఇటీవలే కోర్టు డివోర్స్ మంజూరు చేసింది.
ముంబై కుటుంబ కోర్టు హన్సిక, సోహేల్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి అనుమతించింది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయట.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు వీరిద్దరి మధ్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ విభేదాలు తారాస్థాయికి చెరిపోయాయి. దీంతో డివోర్స్ తీసుకున్నారు.
అయితే తన భర్త నుంచి ఎలాంటి భరణం వద్దని హాన్సిక చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే నివేదికల ప్రకారం హన్సీక ఆస్తులు రూ.37 కోట్లు ఉన్నట్లు సమాచారం.
ఆమె ఒక్కో సినిమాకు రూ.50 లక్షల వరకు తీసుకుంటుంది. అలాగే యాడ్స్, బిజినెస్ రంగంలో భారీగానే సంపాదిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.