OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ సినిమా.. హెడ్‌ఫోన్స్‌తోనే చూడండి
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ టార్గెటెడ్ ఆడియెన్స్ కు బాగానే రీచ్ అయ్యింది. అలాగే ఓ మోస్తరు వసూళ్లు కూడా రాబట్టింది. ఇప్పుడీ బోల్డ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఆగస్టు 15) ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో ఒక తెలుగు బోల్డ్ మూవీ కూడా ఉంది. జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఓ వర్గం ఆడియెన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యింది. పైగా ఈ సినిమా ప్రమోషన్లు కూడా వినూత్నంగా నిర్వహించారు. టికెట్ కొట్టు.. ఐఫోన్ పట్టు అంటూ కొత్త రకం ప్రచారంతో ఈ సినిమాను ఆడియెన్స్ లోకి బాగానే తీసుకెళ్లారు. చెప్పినట్లుగాన హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్ లాంటి చాలా సిటీస్‌లో టికెట్ కొన్న ప్రేక్షకులకు లాటరీలో డబ్బులు కూడా ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక యూనివర్సిటీలో డుండీ , ఆర్య , రోనీ మంచి ఫ్రెండ్స్. కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ల ముగ్గురికి తప్ప. వాళ్లకు గాళ్ ఫ్రెండ్ లేదని మరో ఫ్రెండ్ ఈ ముగ్గురిని మరింత రెచ్చగొడతాడు. అంతేకాదు “నేను అమెరికా నుంచి ఇండియా రిటర్న్ అయ్యేలోపు మీరు వర్జినిటీ కోల్పోవాలి” అని ఛాలెంజ్ చేస్తాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన ముగ్గురు స్నేహితులు.. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలోకి దింపుతారు. ఈ క్రమంలోనే జెనీఫర్‌తో డుండీ, సరయు తో ఆర్య, శ్లోకతో రోనీ లవ్ ట్రాక్ నడిపిస్తారు. అయితే వాళ్ల ప్రేమ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి వాళ్ల ప్రేమ ఫలించిందా? లేదా..? లవ్ ట్రాక్స్ సక్సెస్ అయ్యాయా.. వర్జినిటీ సవాల్ ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
వర్జినిటీ అనే కాన్సెప్టుపై తెరకెక్కిన ఈ సినిమా పేరు వర్జిన్ బాయ్స్. దయానంద్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, గీతానంద్, మిత్రా శర్మ, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కూడా ఓ కీలక పాత్రలో మెరిశాడు. రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని ఈ సినిమాను నిర్మించారు. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన వర్జిన్ బాయ్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.7 రేటింగ్ రావడం విశేషం.
కాగా వర్జిన్ బాయ్స్ సినిమాలో రొమాంటిక్, బోల్డ్ సన్నివేశాలు , డైలాగులు చాలా ఉన్నాయి. కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడడం ఉత్తమం. అలాగే పిల్లలతో కలిసి అసలు చూడొద్దు.
Telugu film #VirginBoys (2025) by @dayanandh369, ft. @geetanand79 @Mitraaw_sharma @NenuMeShrihan #Ronith #AnshulaDhawan @JeniferEmmanu11 @kaushalmanda @Actor_Kedar & @Rjsuryaofficial, now streaming on @PrimeVideoIN & @ahavideoIN.@Raja_Darapuneni @smaransai @urs_jdmaster pic.twitter.com/iwT59rmIqG
— CinemaRare (@CinemaRareIN) August 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








