Cinema : థియేటర్లలో బ్లాక్ బస్టర్.. రూ.3 కోట్లతో తీస్తే రూ.17 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినిమాను చూశారా.. ?
మిస్టరీ, సస్పెన్స్, సైకో థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇలాంటి జానర్ చిత్రాల పట్ల ప్రేక్షకులలో చాలా కాలంగా క్రేజ్ ఉంది. బిగ్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు ఇలాంటి కంటెంట్ పుష్కలంగా కనిపిస్తుంది. ఇటీవల 71వ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గురించి మీకు తెలుసా.. ?

ప్రస్తుతం ఓ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. నిజానికి ఆ మూవీ చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం నిర్మాణానికి 6 రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హత్య గానీ.. అసభ్యకరమైన సన్నివేశాలు గానీ లేవు. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత ఉన్మాదం ఉందంటే వాళ్లు ఒకరినొకరు చంపుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ క్లైమాక్స్ పూర్తిగా మారిపోతుంది. మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇటీవల 71వ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పేరు ‘పార్కింగ్’.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
తమిళంలో రూపొంచిన ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ముత్తుపెట్టై సోము భాస్కర్ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇందులో ఎంఎస్ భాస్కర్, హరీష్ కళ్యాణ్, ఇందుజా రవిచంద్రన్ వంటి కీలకపాత్రలు పోషించారు. కేవలం రూ.3 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద 6 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. అంటే ఈ సినిమా రూ.17 కోట్లు వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
పార్కింగ్ సినిమాకు IMDBలో 7.8 రేటింగ్ ఉంది. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇద్దరు అద్దెదారుల మధ్య పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..








