Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్‌లో సందడి చేయనున్న స్టార్..
ఇటీవలే కింగ్డమ్ మూవీతో హిట్టుకొట్టారు విజయ్ దేవరకొండ. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సె కథానాయికగా నటించింది. అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం దక్కింది.

విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. అర్జున్ రెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా వంటి చిత్రాలతో మెప్పించారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్.. తాజాగా కింగ్డమ్ సినిమాతో అలరించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ సరన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ కు అరుదైన గౌరవం అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
అమెరికాలోని న్యూయార్క్ లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేయనున్నారు. ఈ పరేడ్ కు కో గ్రాండ్ మార్షల్ లుగా వ్యవహరించనున్నారు. ఆగస్ట్ 17న న్యూయార్క్ మాడిసన్ అవెన్యూ వేదికగా “సర్వే భవంతు సుఖినః” అనే థీమ్ తో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుతూ ఈ థీమ్ ఎంచుకున్నట్లు ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్) అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
విదేశాల్లో భారత్ ప్రతిష్టను పెంచే కృషిగా ఈ పరేడ్ వేడుకలను నిర్వహిస్తారు. 1981 నుంచి చిన్న పరేడ్ గా మొదలైన ఈ వేడుకలు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే వేడుకగా మారింది. ఇప్పుడు ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఆరు భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
ఆగస్ట్ 15న పరేడ్ కు ముందు శుక్రవారం రోజున వేడుకలు స్టార్ట్ చేయనున్నారు. ఎంపైర్ స్టేట్ భవనంపై త్రివర్ణ పతాక కాంతులు ప్రసరిస్తాయి. ఆతర్వాత ఆగస్ట్ 16న శనివారం రోజున టైమ్స్ స్క్వేర్ లో భారత జెండా ఎగురువేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆగస్ట్ 17న ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మాడిసన్ అవెన్యూలో ప్రధాన ఇండియా డే పరేడ్ మొదలవుతుంది. ఈ వేడుకలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పాల్గొననున్నారు.
And it’s just 5 days to go … 🤩🇮🇳#indiadayparade #IDP25 #fia #fianynjctne #indiadayparadenyc @TimesNow @TNNavbharat @ZoomTV pic.twitter.com/Xfbnxn5Fp0
— FIA NY-NJ-NE (@FIANYNJCTNE) August 12, 2025
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..








