AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే

Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే

Phani CH
|

Updated on: Mar 13, 2026 | 9:08 PM

Share

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ MGR గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంతారావు గొప్పదనం వివరిస్తూ MGRని కించపరచడంతో కోలీవుడ్‌లో ఆగ్రహం వ్యక్తమైంది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, స్టార్ హీరో విశాల్ దీనిపై స్పందించారు. విశాల్ ట్వీట్ చేస్తూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను ఖండించి, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మైక్ దొరికితే చాలు.. వివాదానికి కేరాఫ్‌గా మారుతున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్… రీసెంట్‌గా మళ్లీ ఓ వివాదానికి తెరలేపాడు. తెలుగు నటుడు కాంతారావు గొప్పదనం గురించి మాట్లాడుతూ తమిళ లెజెండరీ నటుడు MGR‌ని కించపరిచాడు.తన మాటలతో కోలీవుడ్‌ జనాలకు కోపం తెప్పించాడు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ రాజప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాడు. నాజర్ మాత్రమే కాదు.. నడిఘర్ సంఘం సభ్యుడు.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ కూడా.. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌ పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు. సీనియర్ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు తాను షాక్ అయ్యానంటూ .. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఓ సుదీర్ఘ ట్వీట్ చేశాడు విశాల్.’డియర్ సర్, అత్యంత గౌరవంతో అదే సమయంలో భారమైన హృదయంతో స్పందిస్తున్నా.. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరున్న మన దివంగత దిగ్గజ నటుడు MGR గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నాను . మరొక దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బాగున్నప్పటికీ.. అలా ప్రసంగిస్తున్న సమయంలోనే దిగ్గజ నటుడు MGR గారిని కించపరచడం మన ప్రజల మనోభావాలకు మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, అతి ముఖ్యమైనదో మీకు బాగా తెలిసిన విధంగా దీన్ని ముగించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైనా మీ స్థాయి నటుడి గురించి చెడుగా మాట్లాడితే, నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీరు ఈ సమస్యకు క్షమాపణ చెబుతున్నారని భావిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో విశాల్ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు

Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు

Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్

Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్

డ్యామేజ్ జరిగాక.. అసలు ముచ్చట చెబితే ఎట్టా

Follow Us