మెదక్ పట్టణ శివార్లలో రాంగ్ రూట్లో వచ్చిన కారు రెండు బైకులు, ఒక ప్యాసింజర్ ఆటోను బలంగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆటో పల్టీలు కొట్టింది, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కారు డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.