- Telugu News Photo Gallery Cinema photos This Actress Only Done Two Films In Tollywood blockbuster and disaster, but this beauty has crazy chances.. She Is Bhagyashri Borse
Actress: తెలుగులో చేసింది రెండు సినిమాలే.. ఒకటి బ్లాక్ బస్టర్.. మరొకటి డిజాస్టర్.. అయినా ఈ బ్యూటీకి క్రేజీ ఛాన్సులు..
Actress: తెలుగులో చేసింది రెండు సినిమాలే.. ఒకటి బ్లాక్ బస్టర్.. మరొకటి డిజాస్టర్.. అయినా ఈ బ్యూటీకి క్రేజీ ఛాన్సులు.. ఫస్ట్ మూవీ రిలీజ్ కంటే ముందే అందంతో కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. దీంతో ఇండస్ట్రీలో ఎంట్రీకి ముందే తెలుగు కుర్రాళ్ల ఫెవరేట్ లిస్ట్ లో చేరిపోయింది. కానీ ఈ అమ్మడు ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
Updated on: Aug 12, 2025 | 8:46 PM

ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తొలి సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్లను కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి మరింత ఫాలోయింగ్ వచ్చేసింది. ఇంతకీ ఈ వయ్యారిని గుర్తుపట్టారా.. ?

తనే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ అందం, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్టైన్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

ఇప్పుడు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అలాగే తాజాగా ఫిల్మ్ ఫేర్ స్టైల్ సౌత్ ఇండియా అవార్డులలో భాగ్యశ్రీ బోర్సె అదరగొట్టింది. ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫ్యాషన్, రెడ్ కార్పెట్ లుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటిస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్ మూవీ కాంతలో నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసిందని టాక్. అలాగే నెట్టింట గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.




