Telangana: అయ్యో.. ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..
మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెంచుకున్న పెంపుడు పిల్లులే ఓ వృద్దురాలిని దారుణంగా పీక్కుతిన్నాయి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన భర్త రాజీరు చనిపోవడంతో 16 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది.

మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెంచుకున్న పెంపుడు పిల్లులే ఓ వృద్దురాలిని దారుణంగా పీక్కుతిన్నాయి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన భర్త రాజీరు చనిపోవడంతో 16 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. లక్ష్మికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు.. నలుగురు సంతానం కాగా వారందరికి పెళ్లిలు అయి ఎవరికి వారే వేరు వేరుగా జీవిస్తున్నారు. లక్ష్మి మాత్రం తన సొంత ఇంటిలో ఒంటరిగా జీవిస్తోంది. లక్ష్మి రెండో కుమారుడు సముందర్ గత కొన్నేళ్లుగా తల్లి లక్ష్మి బాగోగులు చూసుకుంటున్నాడు. వారానికి రెండు సార్లు వచ్చి తల్లి యోగక్షేమాలు అడిగి వెళుతుంటాడు. అయితే గత నాలుగు రోజులుగా సముందర్ తల్లిని చూసేందుకు రాలేదు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ గురువారం ఇంట్లో గడప ముందు కుప్పకూలిపోయింది వృద్దురాలు లక్ష్మి.
ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్దురాలిని ఎవరు గుర్తించలేదు.. తలుపులు తెరిచి ఉండటం.. ఇంట్లో లైట్లు వేసి లేకపోవడంతో రాత్రివేళ గుర్తించిన స్థానికులు లక్ష్మిని పలకరించేందుకు వెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. వృద్దురాలు లక్ష్మి అపస్మారక స్థితిలో పడి కనిపించింది.. చేతిని పూర్తిగా ఎవరో కొరికినట్టుగా ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కొడుకు సమేందర్ కు సైతం సమాచారం ఇచ్చారు. కొడుకు సమేందర్ అర్థరాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి పెంపుడు పిల్లులు రెండు ఇంట్లో తిరుగుతూ కనిపించాయి.
వృద్దురాలి చేతి చర్మం పిల్లుల వద్ద కనిపించడంతో పెంపుడు పిల్లులే చేతిని కొరికినట్టుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చాడు కొడుకు సముందర్. ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లులు ఆ వృద్దురాలు చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. అయితే తల్లి లక్ష్మి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని.. తన తల్లి ప్రమాదవశాత్తే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి పెద్ద కొడుకు శ్రీనివాస్.. తల్లి లక్ష్మీ మృతిపై మాకు ఎవరిపై అనుమానం లేదంటూ కుమారులు ఫిర్యాదులో పేల్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
