చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా? అవును, "చీర క్యాన్సర్" అనేది నిజం, అయితే చాలా అరుదు. ఒకే చోట గట్టిగా లంగా నాడ కట్టడం వల్ల చర్మం ముదురు రంగులోకి మారి, దురద, పుండ్ల వంటి సమస్యలతో స్కిన్ క్యాన్సర్కు దారితీయవచ్చు. నాడ స్థానం మార్చడం, బెల్ట్ టైపు పట్టీలు ధరించడం వంటి చిన్న మార్పులతో దీనిని నివారించవచ్చు.