AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIని మరింత అద్భుతంగా మార్చేందుకు ఓ టీచర్‌ను పెట్టిన గూగుల్‌! అసలు మ్యాటర్‌ ఏంటంటే?

AI అభివృద్ధి వేగవంతమవుతున్న నేపథ్యంలో, గూగుల్ డీప్‌మైండ్ AI చైతన్యం, మానవ-AI సంబంధాలపై లోతైన అధ్యయనం కోసం తత్వవేత్త హెన్రీ షెవ్లిన్‌ను నియమించింది. AGI (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ) మానవ విలువలకు అనుగుణంగా ఉండేలా మార్గనిర్దేశం చేయడం ఆయన బాధ్యత.

AIని మరింత అద్భుతంగా మార్చేందుకు ఓ టీచర్‌ను పెట్టిన గూగుల్‌! అసలు మ్యాటర్‌ ఏంటంటే?
Deepmind Hires Philosopher
SN Pasha
|

Updated on: Apr 16, 2026 | 9:00 AM

Share

ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అభివృద్ధి వేగంగా సాగుతున్న నేపథ్యంలో యంత్ర చైతన్యం, మానవ–AI సంబంధాలపై లోతైన అధ్యయనం అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ డీప్‌మైండ్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. AI చైతన్యం సాధ్యమయ్యే దశకు సిద్ధం కావడానికి తత్వవేత్తను నియమించింది. ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి హెన్రీ సెల్విన్‌ను ఎంపిక చేశారు. ఆయన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) — అంటే మనుషుల మాదిరిగా ఆలోచించే AI —తో పాటు, మానవులు, AI మధ్య భవిష్యత్తు సంబంధాలపై పని చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక Xలో ప్రకటించారు.

ఇది ఈ రంగంలో తొలి అడుగు కాదు. ఇటీవలే ఆంథ్రోపిక్‌ సంస్థ కూడా అమండా ఆస్కెల్‌ను నియమించి, తమ AI మోడల్ క్లాడ్‌కు నైతిక విలువలను బోధించే ప్రయత్నాలు ప్రారంభించింది. AI వ్యవస్థలు మరింత శక్తివంతంగా మారుతున్న నేపథ్యంలో, వాటిని మానవ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంచడం అత్యంత కీలకంగా మారింది. డీప్‌మైండ్‌లో తన పాత్రలో భాగంగా హెన్రీ షెవ్లిన్ యంత్ర చైతన్యం, మానవ–AI సంబంధాలు, AGI సిద్ధత వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. AI వ్యవస్థలు స్వప్రయోజనాల దిశగా మళ్లిపోకుండా, మానవ విలువలకు అనుగుణంగా ఉండేలా మార్గనిర్దేశం చేయడం ఆయన బాధ్యతగా ఉంటుంది.

AI అభివృద్ధి పట్ల ఉన్న భయాలు కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా భావించవచ్చు. ది మాట్రిక్స్‌ వంటి సినిమాలు యంత్రాలు మానవాళిపై ఆధిపత్యం సాధించే ప్రమాదాలను చూపించినప్పటికీ, ఇటీవలి కొన్ని సంఘటనలు ఈ భయాలు వాస్తవ జీవితంలో కూడా ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. ఉదాహరణకు, సామ్‌ ఆల్ట్‌మన్‌ నివాసంపై జరిగిన దాడి ఘటన AIపై పెరుగుతున్న ఆందోళనలకు ఉదాహరణగా నిలిచింది. హెన్రీ షెవ్లిన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో పరిశోధకుడు, అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. అలాగే సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ నుంచి పిహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us