AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. సమ్మె నోటీసులు అందించిన జేఏసీ నేతలు

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 13) ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు బస్‌ భవన్‌లో అధికారులను కలిశారు.

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. సమ్మె నోటీసులు అందించిన జేఏసీ నేతలు
Telangana Rtc
Balaraju Goud
|

Updated on: Mar 14, 2026 | 8:09 AM

Share

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (మార్చి 13) ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ వెంకన్న నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులు బస్‌ భవన్‌లో అధికారులను కలిశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. అలాగే 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సమ్మె నోటీసులో ఆర్టీసీ కార్మికులు కీలక డిమాండ్లు ప్రస్తావించారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ‘మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా అందించే నిధులను కోత లేకుండా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ తరుఫున ఆర్టీసీకి రావాల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత తోపాటు ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. అలాగే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని కోరారు. ఇక అన్ని కేటగిరీల్లోని సిబ్బందిపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us