Parliament LIVE: దేశ రాజకీయాల్లో సూపర్ బిగ్‌డే..! పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు.. లైవ్ వీడియో
దేశ రాజకీయాల్లో ఇవాళ సూపర్ బిగ్‌డే..! ఈరోజే పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు ముందుకు రానుంది.. నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు పడనుంది.. డీలిమిటేషన్‌పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటోన్నాయి.. అయితే.. దశాబ్దాలనాటి 33శాతం మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం దాల్చనుంది. మహిళా బిల్లుకు మాత్రం విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి..
దేశ రాజకీయాల్లో ఇవాళ సూపర్ బిగ్‌డే..! ఈరోజే పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు ముందుకు రానుంది.. నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు పడనుంది.. డీలిమిటేషన్‌పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటోన్నాయి.. అయితే.. దశాబ్దాలనాటి 33శాతం మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం దాల్చనుంది. మహిళా బిల్లుకు మాత్రం విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.. అయితే.. నేటి నుంచి 3 రోజులపాటు పార్లమెంట్ స్పెషల్ సెషన్ జరగనుంది. ఇక, బిల్లులు ప్రవేశపెట్టాక ఈ సాయంత్రం 3 గంటలకు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. లోక్‌సభలో అర్జున్ మేఘ్వాల్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. నేడు, రేపు లోక్‌సభలో బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగనుంది. లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ జరగనుంది. పార్లమెంట్ ఉభయసభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ నెల 18న రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరగనుంది.
2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమలు చెయ్యడానికి అవసరమైన 3 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకువస్తోంది కేంద్రం.
ఇందులో మొదటి బిల్లు లోక్‌సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడంతోపాటు 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేసేందుకు అవసరమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
మరో బిల్లు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించింది.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించేందు మరోబిల్లును తీసుకువస్తున్నారు.
ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు చర్చకు అవకాశం కల్పిస్తున్నారు.
ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు కాగా.. మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. మిగతా రెండింటికీ సాధారణ మెజారిటీ సరిపోతుంది.
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

