Singer Mangli Case: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్
సింగర్ మంగ్లీ కేసులో రమావత్ మధు అప్రూవర్‌గా మారి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మంగ్లీకి ఈ కేసుతో సంబంధం లేదని, హిమాకాంత్ రెడ్డియే రూ.20 కోట్లు మోసం చేశారని ఆయన ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్ డబ్బుల మళ్లింపుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు మాత్రం మధుతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఫోటోలు బయటపెట్టారు.
సింగర్ మంగ్లీ వ్యవహారంలో నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రమావత్ మధు ఇప్పుడు అప్రూవర్‌గా మారారు. మధు విడుదల చేసిన వీడియోలో, సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి స్నేహితులని, హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పారని మధు పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు
POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు
ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

