కోతుల కోసం పెట్టిన లడ్డూకి బాలుడు బలి
ములుగు జిల్లా గోవిందరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. కోతుల బెడద నివారణకు ఉంచిన విషపు లడ్డూలు తిని నాలుగేళ్ల అశ్విన్ నందన్ ప్రాణాలు కోల్పోయాడు. పల్లె ప్రకృతి వనంలో ఆడుకుంటున్న బాలుడు వాటిని స్వీట్లు అనుకుని తిన్నాడు. ఈ ఘటన గ్రామ పంచాయతీ సిబ్బంది పనా అని స్థానికులు ఆరోపిస్తున్నారు. జంతు ప్రేమికులు, మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం డిమాండ్ చేస్తున్నారు.
కోతుల బెడద వదిలించుకోవాలని చేసిన అనాలోచిత ప్రయత్నం, ఒక పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. విషపు గుళికలు కలిపిన ఆహారాన్ని తిని నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆర్ఎంపి వైద్యుడు శ్రవణ్ కుమారుడు అశ్విన్ నందన్ , ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమీపంలోని పల్లె ప్రకృతి వనంలోకి వెళ్లాడు. అక్కడ కోతులను హతమార్చడానికి ఎవరో బాలామృతంలో విషపు గుళికలు కలిపి లడ్డూల్లా చేసి ఉంచారు. అవి స్వీట్లు అనుకుని భ్రమపడిన అశ్విన్ నందన్, ఆ విషపూరిత పదార్థాన్ని తిన్నాడు. మిగిలిన పిల్లలు దానిని తినకుండా పక్కకు పడేశారు. విషం కలిపిన పదార్థం తిన్న కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాలుడు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామ పంచాయతీ సిబ్బందే కోతులను చంపడానికి ఈ విషపు లడ్డూలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూగజీవాలను హింసించడమే కాకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Undavalli Caves: బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
Gas Cylinder Blast: టపాసుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఇళ్లు బుగ్గిపాలు
Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్‌లు
రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా
బుక్ చేసి వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్!
అడ్డంగా దొరికిపోయిన వందే భారత్ టీటీఈ.. వీడియో వైరల్
బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా ??

