తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 లో ఎన్టీవీ ఛానల్ తో రిపోర్టర్ గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2014 లో నెం.1 న్యూస్ క్రైం బ్యూరోగా, 2016 లో రాజ్‌న్యూస్ ఆదిలాబాద్ బ్యూర్ గా 2018 లో వరంగల్ రాజ్‌న్యూస్ కరస్పాండెంట్ గా విధులు నిర్వహించాను. 2019 డిసెంబర్ నుండి టీవీ9 తెలుగులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Telangana: దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర.. నాలుగు రాష్ట్రాల నుంచి..
గుడి లేదు.. గుడిలో విగ్రహం లేదు.. కొండనే గుడి.. గుహనే సన్నిది.. జ్యోతి రూపమే దైవం.. దీపజ్యోతి రూపంలో దర్శనమిచ్చే అమ్మే ఆదిపరాశక్తి. అంతటి మహిమాన్వితమైన దైవాన్ని దర్శించుకోవాలంటే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కొండ కోనల్లో కొలువైన జంగుబాయి జాతరకు వెళ్లాల్సిందే. ఈ జాతర గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
- Naresh Gollana
- Updated on: Dec 30, 2025
- 6:44 pm
రక్తం మరిగిన బెబ్బులి.. గంటలోనే ఇద్దరు బలి.. ఏడాదిలో ఎంత మందో తెలుసా..?
చంద్రాపూర్ జిల్లా తడోబా బఫర్ జోన్లో పులి పంజా విసిరింది. కేవలం 45 నిమిషాల వ్యవధిలో ఇద్దరు వలస కూలీలను బలి తీసుకుంది. దీంతో స్థానికులు భయాందోళణ చెందుతున్నారు. పులి దాడుల తీవ్రత పెరగడంతో అటవీ శాఖ ప్రత్యేక బృందాలను మోహరించింది. అసలు ఈ ఈ ఏడాదిలో పులి దాడుల్లో ఎంత మంది చనిపోయారు..? అనేది ఈ స్టోరీలోత తెలుసుకుందాం..
- Naresh Gollana
- Updated on: Dec 29, 2025
- 1:06 pm
Telangana: మందు ముడితే చెంపదెబ్బలతో తరిమికొడతారు..ఈ గ్రామం రూల్స్ తెలిస్తే అవాక్కే..
గుడుంబా, గంజాయి, కళ్లు , మద్యం వీటికి ఆ గ్రామంలో ఎంట్రీ లేదు. ఆ మత్తుపదార్థాలకు బానిసై విచక్షణ కోల్పోతే సంసారం వీధిలో పడతుంది. కుటుంబం అగౌరవం పాలవుతుంది. భవిష్యత్ అందకారం అవుతుంది. అలాంటి తప్పులు జరగకూడదు అంటే ఆ మత్తుకు మా గ్రామంలోకి ఎంట్రీనే ఉండకూడదని నిర్ణయం తీసుకుంది ఆ గ్రామం. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే ఏం చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Naresh Gollana
- Updated on: Dec 26, 2025
- 9:36 pm
Telangana: చెప్పులు, బూట్లతో వస్తే ఆ గ్రామాల్లోకి నో ఎంట్రీ.! కారణం తెలిస్తే షాక్ అవుతారు
పుష్యమాసం వచ్చిదంటే చాలు ఆ గ్రామాలు భక్తిభావంతో పులకించిపోతాయి. అంతేకాకుండా ఆ గ్రామాల్లోకి అడుగు పెట్టాలంటే చెప్పులు లేకుండా రావాల్సిందే. ఒకవేళ చెప్పులతో వస్తే.. జరిమానా తప్పదు. మరి ఆ గ్రామాలు ఏంటి.? ఎక్కడున్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
- Naresh Gollana
- Updated on: Dec 24, 2025
- 1:38 pm
3 నెలల హైటెన్షన్ .. ఎట్టకేలకు చిక్కిన మ్యాన్ ఈటర్.. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో రెండు నెలలుగా భీతిగొల్పిన నరభక్షక పులి టీ 115 ఎట్టకేలకు పట్టుబడింది. రైతులు, పశువులను పొట్టనపెట్టుకున్న ఈ మ్యాన్ ఈటర్‌ను పట్టుకునేందుకు అటవీశాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. ట్రాప్ కెమెరాలు, మత్తు ఇంజక్షన్ సాయంతో పులిని బంధించి టైగర్ ట్రాంజిట్ సెంటర్‌కు తరలించారు. ప్రజలకు భద్రత కల్పించే దిశగా ఇది కీలక విజయం.
- Naresh Gollana
- Updated on: Dec 20, 2025
- 4:21 pm
Telangana: ఎన్నికల్లో గెలవగానే ఎలుగుబంటిగా మారిపోయిన సర్పంచ్.. ఎందుకంటే..?
గెలిచే వరకు ఓ బాధ గెలిచాక ఓ బాధ అన్నట్టుగా మారింది ఆ సర్పంచ్ పరిస్థితి. ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నేరుగా ఆ సర్పంచే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే కథనం లోపలికి వెళ్లాల్సిందే .. ..
- Naresh Gollana
- Updated on: Dec 19, 2025
- 9:43 pm
Telangana: అదిగో తోక.. ఇదిగో పులి.. నమ్మండి.! సాక్ష్యం ఈ ఫోటోనే.. సీన్ కట్ చేస్తే
మూడున్నరేళ్ల వయసున్న పులిగా గుర్తించిన అటవిశాఖ అదికారులు సమీప ప్రాంత ప్రజలను, సింగరేణి కార్మికుల ను అలర్ట్ చేశారు. అయితే పులి అదే రాత్రి రాష్ట్ర రహదారి దాటి.. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గుండా గోదావరి వైపు ప్రయాణం సాగించినట్టుగా గుర్తించిన అటవిశాఖ అదికారులు.. 21 ట్రాప్ కెమెరాల సాయంతో పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
- Naresh Gollana
- Updated on: Dec 18, 2025
- 1:46 pm
Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!
ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్‌ను ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా.. ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు.. ఈ సారి జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడం ఓ విశేషం.
- Naresh Gollana
- Updated on: Dec 17, 2025
- 7:47 pm
ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?
ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగ రాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయితీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. ఇంతకు ఆ గ్రామం ఏంది.. అక్కడ ఇన్నాళ్లు ఎందుకు ఎన్నికలు జరగలేదో తెలుసుకుందాం పదండి.
- Naresh Gollana
- Updated on: Dec 17, 2025
- 1:55 pm
ఏజెన్సీలో కలకలం.. ఓ ఇంట్లో తలదాచుకున్న మావోయిస్టులు.. పోలీసుల అదుపులో టాప్ లీడర్..!
కొమురంభీం జిల్లా సిర్పూర్ యు అడవుల్లో కలకలం రేగింది. సిర్పూర్ (యు) లోని ఓ ఇంటిలో తలదాచుకున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంకలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన 16 మంది మావోయిస్టులు షెల్టర్ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రాణహిత మీదుగా కొమురంభీం జిల్లాలోకి చేరుకున్నారని సమాచారం.
- Naresh Gollana
- Updated on: Dec 16, 2025
- 6:47 pm
Telangana: సాధువులకు ఇంత దివ్యశక్తి ఉంటుందా..? వారు చెప్పిన చోట తవ్వకాలు జరుపగా..
గోదావరి పరిక్రమ యాత్రలో ఆ ప్రాంతానికి వచ్చిన సాదు సంతులు చెప్పిన మాటే నిజమైంది. గోదావరి తీరానికి సమీపంలోని ఓ స్థలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. పెద్ద ఎత్తున తరలొచ్చిన భక్త జనం ఎదుట సాగిన తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా కోలహాలంగా మారింది. అసలేం జరిగిందంటే..
- Naresh Gollana
- Updated on: Dec 15, 2025
- 5:37 pm
Sarpanch Election: అమెరికా టూ తెలంగాణ.. మామ వేసిన ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచిన కోడలు
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత ముఖ్యమో తెలియజేసే ఆసక్తికర ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. కోడలు తమ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. అమెరికా నుంచి వచ్చి మరీ వేసిన మామయ్య ఓటు.. కోడలి గెలుపులో కీలకంగా మారింది. రెండో విడతలో జరిగిన ఎన్నికల్లో ఆమే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించింది. దీంతో విజయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- Naresh Gollana
- Updated on: Dec 15, 2025
- 6:14 pm