కేరళలోని తిరువనంతపురంలో ఓ ఇంట్లోని ఏసీ యూనిట్లో ఐదు పాములు కనిపించడం కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి బెడ్రూమ్లో ఏసీ కింద కదలికలు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ వచ్చి నాలుగు పాములను పట్టుకోగా, ఒకటి పైపు మార్గంలో బయటకు వెళ్లిపోయింది. అయితే అవి విషపూరితం కావని తేలడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.