AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన RTC బస్సు.. !

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 23) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి ఆసిపాబాద్ బయలుదేరింది.

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులోకి దూసుకెళ్లిన RTC బస్సు.. !
Tgsrtc Bus Overturns At Shyampur Bridge
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 12:17 PM

Share

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం (ఫిబ్రవరి 23) ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి ఆసిపాబాద్ బయలుదేరింది. శ్యాంపూర్ వద్దకు రాగానే ఇరుకైన వంతెనపై నుండి అదుపు తప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అందులో కండక్టర్ తోపాటు పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమయానికి స్పందించడంతో క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షత గాత్రులను స్థానిక ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటం, ఇరుకైన వంతెన కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంపై మంత్రులు పొన్నం , జూపల్లి కృష్ణారావు లు స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆదిలాబాద్ ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు. ఇరుకైన శ్యామ్‌పూర్ బ్రిడ్జిపై ప్రొటెక్షన్ వాల్ లేకపోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని మంత్రులకు తెలిపారు అదికారులు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us