AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meena: ఆయన లేకుంటే మీనా లేదు.. ఎంతోమంది హీరోలతో నటించా.. కానీ

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

Meena: ఆయన లేకుంటే మీనా లేదు.. ఎంతోమంది హీరోలతో నటించా.. కానీ
Meena
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2026 | 8:57 AM

Share

సీనియర్ హీరోయిన్ మీనా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని షేక్ చేశారు. ప్రస్తుతం మీనా సినిమాల స్పీడ్ తగ్గించేశారు. అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. మీనా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. తమిళ్ తోపాటు తెలుగులోనూ క్రేజ్ సొంతం చేసుకున్న మీనా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ హీరోలందరిలోనూ తనకు వెంకటేష్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయనతో పనిచేయడం అత్యంత సౌకర్యంగా ఉండేదని మీనా వెల్లడించారు. ఆయనతోనే ఎక్కువ విజయవంతమైన చిత్రాలు చేసినట్లు ఆమె తెలిపారు.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

చంటి, సుందరకాండ వంటి చిత్రాల సమయంలో తాను చాలా సైలెంట్ గా, కొత్తగా ఉండేదాన్నని, వెంకటేష్‌తో సహా చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు కూడా ప్రశాంతంగా ఉండేవారని మీనా గుర్తు చేసుకున్నారు. మొదటి రెండు, మూడు చిత్రాలలో తాను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదని, ఆతర్వాత వారితో, వారి కుటుంబాలతో స్నేహాన్ని పెంచుకున్నానని ఆమె వివరించారు. అయితే, బాలకృష్ణ మాత్రం కొంచెం భిన్నమని, తాను మాట్లాడకపోయినా ఆయనే తనతో సంభాషణలు మొదలుపెట్టి మాట్లాడించేవారని మీనా పేర్కొన్నారు. మోహన్ బాబుతో తన తొలి అనుభవం ప్రత్యేకమైనదని, “అల్లరి మొగుడు” సినిమా సమయంలో ఆయన బెదిరించినట్లు అనిపించినా, అది కేవలం సరదాకే అని తర్వాత తెలిసనదని మీనా అన్నారు. అప్పట్లో తాను చాలా చిన్న వయస్సులో ఉండటం, తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆయన మాటల అర్థం తెలియలేదని ఆమె వివరించారు. మోహన్ బాబు పిల్లలు లక్ష్మి, విష్ణులతో షూటింగ్ సమయంలో అంత్యాక్షరి, మ్యూజికల్ చైర్స్ వంటి ఆటలు ఆడేదాన్ని అని తెలిపారు. తర్వాత ఆయన నిజంగా చాలా మంచి వ్యక్తి అని అర్థమైందని ఆమె గుర్తు చేసుకున్నారు.

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

తన సినీ జీవితంలో అల్లరి, కొంటె పాత్రలు, సెంటిమెంటల్ పాత్రలు రెండూ చేసినప్పటికీ, కొంటె పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపానని మీనా తెలిపారు. అది తనలోని అల్లరితనాన్ని బయటపెట్టడానికి ఒక అవకాశంలా భావించానని ఆమె వివరించారు. పరిశ్రమలో సంబంధాలపై మాట్లాడుతూ, తాను చాలా చిన్న వయస్సులో ఉండటం వల్ల ప్రేమ, సంబంధాల గురించి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని, ఈ విషయంలో తాను “సాధారణ విద్యార్థిని” అని మీనా అన్నారు. తన వృత్తి నైపుణ్యమే తన అతి పెద్ద బలం అని, తన వృత్తి నైపుణ్యమే మోహన్ బాబు లాంటి వారి నుండి కూడా గౌరవాన్ని సంపాదించిందని మీనా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్