AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఆమని. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తున్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని
Amani
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2026 | 8:28 PM

Share

తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఆమని తన కెరీర్‌లోని అనుభవాలను, ఓ స్టార్ హీరో పట్ల తనకున్న అభిమానాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హీరోయిన్‌గా కేవలం పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితంకాకుండా, శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం వంటి చిత్రాలలో తాను పోషించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండటం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. అయితే ఒక నటిగా కొన్ని పాత్రలు చేయలేకపోయానే, కొన్ని కాంబినేషన్లు కుదరలేదే అనే అసంతృప్తి ప్రతీ నటిలోనూ ఉంటుందని, తనలో కూడా అది ఉందని ఆమని అన్నారు. శ్రీదేవి మీనుం కోకిలాలో చేసిన పాత్ర వంటివి, అలాగే రమ్యకృష్ణ బాహుబలిలో చేసిన పాత్ర వంటివి తనకు చేయాలని ఉందని తన కోరికను తెలిపారు.

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

ఆమని తన కెరీర్‌లో సాధించిన విజయాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే, ఒక అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయిందని చెప్పారు. చిన్నతనం నుంచే మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానినని, ఆయన సినిమా అంటే తనకు పిచ్చి అని, దేవుడిని ఎలా పూజిస్తామో, అలాగ చిరంజీవిని ఆరాధించేదాన్ని అని ఆమె వివరించారు. స్కూలుకు వెళ్లే రోజుల్లోనే రాధ, విజయశాంతి వంటి నటీమణులతో చిరంజీవి నటించిన చిత్రాలు చూసి ఆయనకు అభిమానిగా మారానని ఆమని తెలిపారు. ఆయన పక్కన నటించాలనేది తన చిరకాల స్వప్నమని, పాటల్లో ఊహల్లో ఆయన పక్కన డ్యాన్స్ చేస్తున్నట్లు కలలు కనేదాన్ని అని అన్నారు. ఆమని కల నిజమయ్యే అవకాశం రిక్షావోడు సినిమాతో వచ్చిందని, శుభలగ్నం తర్వాత ఆ సినిమాకు తనను అడిగారని, డేట్స్ కూడా తీసుకున్నారని చెప్పారు. షూటింగ్ ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు చిరంజీవితో మాట్లాడడం కూడా జరిగిందని, ఆ సినిమాలో సౌందర్య కూడా ఉండటంతో ఇద్దరూ కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందించారని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

అయితే, అనూహ్యంగా దర్శకుడు మారడంతో, కోదండరామిరెడ్డి గారు చేయాల్సిన సినిమా మరో దర్శకుడి చేతుల్లోకి వెళ్లడం, దాంతో తాను కాకుండా నగ్మాను తీసుకున్నారని ఆమని తీవ్ర నిరాశతో వెల్లడించారు. చిరంజీవి పక్కన చేయలేకపోయానే అనే బాధ తన జీవితంలో రెండుసార్లు మాత్రమే ఏడ్చిన వాటిలో ఒకటి అని తెలిపారు. ఈ అసంతృప్తి జీవితాంతం తనతో ఉండిపోతుందని ఆమని పేర్కొన్నారు. అలాగే, చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో ఆయనకు సోదరి పాత్ర కోసం తనను సంప్రదించారని ఆమని గుర్తు చేసుకున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు చాలాసార్లు ఫోన్ చేసినా, తాను ఆ పాత్రను తిరస్కరించానని ఆమె స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి తన డ్రీమ్ హీరో అయిన చిరంజీవిని తెరపై తమ్ముడు అని పిలవడం తనకు ఇష్టం లేదని, ఊహించుకోవడం కూడా కష్టం అని అన్నారు. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలని, అయినప్పటికీ తన అభిమానానికి కట్టుబడి “స్టాలిన్”లో సోదరి పాత్రను ఖుష్బు గారికి వదులుకున్నానని ఆమని వివరించారు.

ఇవి కూడా చదవండి

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us