AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో బాలయ్య పవర్‏ఫుల్ లుక్‏లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది .

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Apr 11, 2026 | 4:44 PM

Share

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కామెబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్ కింగ్. ఆయన చెప్పే డైలాగ్స్ మాములుగా ఉండవు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే బాలయ్య అవలీలగా చెప్పేస్తారు. అయితే ఓ కమెడియన్ బాలకృష్ణ ముందు ఓ భారీ డైలాగ్ చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ కమెడియన్ డైలాగ్ చెప్తుంటే బాలకృష్ణ కూడా అందుకొని ఆతనితో పాటే ఆ డైలాగ్ చెప్పారు. ఆ కెమెడియన్ ఎవరో కాదు తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన సప్తగిరి.

ఇవి కూడా చదవండి

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

ఈ వీడియో ఇప్పటిది కాదు. సప్తగిరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇలా ఎన్టీఆర్ నటించిన దాన వీర సుర కర్ణ సినిమాలోని ఓ భారీ డైలాగ్ ను బలయ్యాయ్ ముందు చెప్పాడు సప్తగిరి. అతని డైలాగ్ డెలివరీ చూసి బాలయ్య అవాక్ అయ్యాడు. అతనితో కలిసి డైలాగ్ చెప్పడమే కాకుండా.. నీ కాళ్లకు దండం పెట్టాలయ్యా అంటూ సరదాగా ఆటపట్టించారు బాలకృష్ణ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర